MP Avinash Reddy on YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో శుక్రవారం సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సీబీఐ అధికారులు ఆయనను విచారించారు. విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణ తప్పుదోవ పడుతోందని.. తప్పుడు సాక్ష్యాలతో అమాయకులను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. కట్టుకథను అడ్డుపెట్టుకుని విచారణ కొనసాగిస్తున్నారని అన్నారు. తన న్యాయస్థానంపై నమ్మకం ఉందని.. న్యాయం కోసం ఎంత దూరమైన వెళతానని స్పష్టంచేశారు. సీబీఐ కూడా లీకులు ఇస్తోందని ఆరోపించారు. సీబీఐ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని అన్నారు. రెండుసార్లు ఆడియో, వీడియో టేపులు రికార్డు చేయాలని సీబీఐను అడిగానని.. వాళ్లు పట్టించుకోకపోవడంతోనే కోర్డుకు వెళ్లానని చెప్పారు. కీలక విషయాలను పక్కనబెట్టి.. తనను విచారణకు పిలిచారని తెలిపారు.
'ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్నా.. వైఎస్సార్సీపీ క్యాడర్ నన్ను ప్రశ్నిస్తోంది. ఇక నుంచి నేను మాట్లాడటం మొదలు పెడతా.. వివేకాది మర్డర్ ఫర్ గైన్. ఆయన ఒక ముస్లిం మహిళను 2005లో పెళ్లి చేసుకున్నారు. ఆమెకు పుట్టిన కొడుకును రాజకీయ వారసుడిగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. వివేకా సార్ ఆయన పేరును కూడా ముస్లిం పేరుగా మార్చుకున్నారు. ఆయన ఆస్తులను కూడా రెండో భార్యకు రాయాలని భావించారు. ఈ ఆస్తులన్ని వాళ్లకు వెళ్లిపోతాయి.. రాజకీయ వారసులుగా వస్తారని సునీతమ్మ భర్త రాజశేఖర్ కుట్ర చేశాడని నా అనుమానం. వివేకా హత్య కేసులో రెండో పెళ్లి కూడా కీలక అంశం.
హత్య జరిగిన ప్రాంతంలో లెటర్‌ను మాయం చేశారు. నేను గుండెపోటు అని చెప్పలేదు. ఇదంతా టీడీపీ వాళ్లు చిత్రీకరించారు. హత్యలో ఆస్తి తగాదాలు ఉన్నాయి. నా సోదరి సునీతమ్మ హైకోర్టులో, సుప్రీంకోర్టులో అనేక ఆరోపణలు చేసింది. నేను ఏ ఒక్క రోజు నేను ఎవరి గురించి మాట్లాడలేదు. నేను మౌనంగా ఉండడంతో క్యాడర్‌లో గందరగోళం నెలకొంది. అందుకే నేను నోరు విప్పాల్సి వస్తోంది. నేను కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగానే.. సీబీఐ అధికారులు సునీతమ్మకు సమాచారం ఇచ్చి ఇంప్లీడ్ చేస్తున్నారు..' అని అవినాష్ రెడ్డి తెలిపారు.
ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందనే ప్రచారం హస్యాస్పదంగా ఉందని ఆయన కొట్టిపారేశారు. ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని వివేకానంద రెడ్డి ప్రచారం నిర్వహించారని గుర్తుచేశారు. ఈ కేసులో సీబీఐ విచారణ పక్కదోవపడుతుందని.. 8 మంది సాక్షులు చెప్పిన విషయాలను సీబీఐ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బెంగుళూరు సెటిల్‌మెంట్‌కు వివేకా హత్యకు సంబంధం లేదన్నారు.
Also Read: Vivek Murder Case: వివేకా హత్య కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు.. ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట
Also Read: Dharani Portal Issues: ధరణి పోర్టల్ సమస్యలపై కాంగ్రెస్ హామీ కార్డు.. పైలెట్ ప్రాజెక్టు ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి