ఇన్నాళ్లు చంద్రబాబు సీఎంగా చేశారు.. ఇక ప్రధాని కావాలి ! ఈ సరికొత్త నినాదాన్ని అందుకున్నారు జేసీ దివాకర్ రెడ్డి. ఈ రోజు విజయవాడలో జరుగుతున్న మహానాడులో జేసీ ఈ వ్యాఖ్యలు చేశారు. జేసీ మాటల్లో చెప్పాలంటే "చంద్రబాబు మాట్లాడితే నేనిక్కడే ఉంటానంటున్నారు.. ఏంది సర్ నాకు అర్థం కాదు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఇక చాలదా మీకు ? ఇంకా ఆశ ఉందా? వద్దు.. మీరు ఇంకా పైకి రావాలి.. దేశానికి ప్రధానమంత్రి కావాలి.. అదే జరిగితే మేమంతా సంతోషిస్తాం. చంద్రబాబుగారు మీకున్నంత దూరదృష్టి సమాకాలిక నేతల్లో ఎవరికీ లేదు.. పీఎం అయ్యే అన్ని అర్హతలు మీరు ఉన్నాయి..అవుతారు కూడా ." అంటూ చంద్రబాబును ఉద్దేశించి జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లోకేష్ సీఎం అయితే తప్పేంటి..
ఇదే సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి లోకేష్ పై కూడా అసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ గురించి ఆయన ఏమన్నాడంటే .. లోకేష్ కు సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. రానున్న రోజుల్లో లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు. దీనికి ఆయన సమర్థుడే కదా..నేను సంపాదించిన ఆస్తి నా కొడుకుకి ఇవ్వనా..అలాగే టీడీపీ కూడా చంద్రబాబు సొంతం. ఆయన తన బాధ్యతలను తన కొడుకుకి ఎందుకు ఇవ్వకూడదు ? అని జేసీ తనదైన శైలిలో ప్రసంగించారు.
టీడీపీ చంద్రబాబు సొంతం
నందమూరి వంశాన్ని పక్కన పెట్టారని చంద్రబాబుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో జేసీ ఈ అంశంపై స్పందించారు. టీడీపీ ఎన్టీఆర్ స్టాపిస్తే ..నార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చింది చంద్రబాబు అని కొనియాడారు. ముమ్మాటికి టీడీపీ చంద్రబాబు సొంతమన్నారు. ఈ విషయంలో ఆయన్న ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదని జేసీ వ్యాఖ్యనించారు.