PAWAN KALAYAN: ఆంధ్రప్రదేశ్ లో కొత్త పొత్తు పొడిచిందా? వచ్చే ఎన్నికలకు పొత్తులు ఖరారయ్యాయా? అంటే రాజకీయక వర్గాల నుంచి అవుననే తెలుస్తోంది. ఏపీ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యమన్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమంటూ పార్టీ ఆవిర్భావ సభలో చేసిన ప్రకటన సంచలనమైంది. పవన్ ప్రకటనతో విపక్షాలన్ని ఏకమవుతాయా అన్న చర్చ సాగింది. పవన్ ప్రకటనను స్వాగితించేలా టీడీపీ నేతలు మాట్లాడారు. నియంత పాలన సాగిస్తున్న జనగ్ రెడ్డిని ఇంటింకి పంపించేందుకు.. ఏపీ సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకోక తప్పదని చంద్రబాబు చెప్పారు. అంతేకాదు వైసీపీని ఓడించేందుకు త్యాగాలు చేయడానికి కూడా టీడీపీ సిద్దంగా ఉందని ప్రకటించారు. చంద్రబాబు మాటలతో పొత్తుకు దాదాపుగా టీడీపీ సిద్దమైందని అర్ధమైంది. అయితే విపక్షంలోని అన్ని పార్టీలు కలుస్తాయా.. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయా.. లేక బీజేపీ-జనసేన-టీడీపీ మధ్య పొత్తు ఉంటుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది.
జనసేన ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉంది. తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ఉంటారని కొందరు బీజేపీ నేతలు బహిరంగంగానే ప్రకటించారు. ఇప్పుడు టీడీపీ సీన్ లోకి రావడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఏపీలో 2014 సీన్ రిపీట్ అవుతుందని.. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయని కొందరు అంచనా వేస్తుండగా... మరికొందరు మాత్రం బీజేపీ-టీడీపీ కలిసే అవకాశాలు లేవని వాదిస్తున్నారు. ఏపీ బీజేపీ నేతలు కూడా తమకు జనసేనతోనే పొత్తు ఉంటుందని చెబుతున్నారు. టీడీపీ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ మాత్రం టీడీపీతో బీజేపీ పొత్తు ఉండదనే సంకేతం ఇస్తున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ కూడా ఫోకస్ చేశారని.. టీడీపీతో కలిసిపోయే విషయంలో బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నారని తెలుస్తోంది. అయితే జనసేనతో పొత్తు విషయంలో స్పష్టతగా ఉన్న బీజేపీ.. చంద్రబాబు విషయంలో మాత్రం స్పందించడం లేదట. దీంతో బీజేపీ హైకమాండ్ తీరుతో విసిగిపోయిన జనసేన చీఫ్.. అవసరమైతే బీజేపీకి కటీఫ్ చెప్పి.. తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయాలని దాదాపుగా డిసైడ్ అయ్యారని అంటున్నారు. పొత్తుల విషయమై బీజేపీ పెద్దలతో మరోసారి మాట్లాడి.. అధికారికంగా పవన్ కల్యాణ్ తన నిర్ణయం ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.
పొత్తు విషయంలో టీడీపీ, జనసేన మధ్య ఇప్పటికే అంతర్గతంగా చర్చలు జరిగాయని కూడా చెబుతున్నారు. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ఎజెండా వంటి విషయాలపైనా చర్చ జరిగిందని తెలుస్తోంది. టీడీపీ-జనసేన సీట్ల లెక్కలపై సంబంధించి ఇరు పార్టీల నుంచి లీకులు కూడా బయటికి వస్తున్నాయి. తమకు 75 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవ్వాలని జనసేన డిమాండ్ చేసిందని సమాచారం. అయితే అంత భారీ స్థాయిలో ఇవ్వడం కుదరదన్న తెలుగుదేశం పార్టీ.. 40 సీట్లు కేటాయించడానికి ముందుకు వచ్చిందని అంటున్నారు. అయితే 40 స్థానాలు చాలా తక్కువని వాదిస్తున్న జనసేన నేతలు.. 60కి తగ్గకుండా ఇవ్వాలని పట్టుబడుతున్నారట. టీడీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం 50 సీట్లకు జనసేన ఓకే చెప్పవచ్చని భావిస్తున్నారట. ఎన్నికల సమయం దగ్గర పడ్డాకా సీట్ల విషయంలో చర్చలు జరిపితే గందరగోళం నెలకొంటుంది.గతంలో మహాకూటమి సమయంలో అలానే జరిగింది. నామినేషన్ల ముగింపు వరకు పొత్తులు తేలలేదు. అందుకా ఈసారి అలాంటి ఇబ్బంది రాకుండా ఎన్నికలకు ఏడాది ముందే పొత్తులు, సీట్లు ఖరారు చేసుకోవాలనే యోచనలో రెండు పార్టీలు ఉన్నాయని తెలుస్తోంది.
మరోవైపు సీట్ల సర్ధుబాటుతో పాటు ఏ జిల్లాలో ఎవరూ పోటీ చేయాలనే విషయంలోనూ చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. మహానాడు వేదికగా పార్టీ నేతలకు పొత్తుల విషయంలో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. టీడీపీ నేతలు కూడా జనసేన పొత్తును కోరుకుంటుండటంతో.. సీట్ల విషయంలో పట్టువీడి త్యాగాలు చేసేందుకు కూడా తమ్ముళ్లు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది.
READ ALSO: Telangana Governer: అప్పులయ్యాయని రాజభవనకు లెటర్.. రూ. 25 వేలు సాయం చేసిన గవర్నర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook