Telugu Desam Party Mini Manifesto For 2024 Assembly Elections: తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మినీ మేనిఫెస్టోను ప్రకటించింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరు కీలక పథకాలను వెల్లడించారు. రాజమండ్రిలో జరుగుతున్న టీడీపీ మహానాడులో ఆయన మేనిఫెస్టోలోని హామీలను ప్రకటించారు.
Kodali Nani: కొడాలి దెబ్బకు ప్రస్తుతం గుడివాడలో టీడీపీకి సరైన నాయకులు లేరు. కేడర్ కూడా బలహీనమైంది. ఉన్న కొద్దిమంది నేతలు ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ ఉన్నా యాక్టివ్ గా పని చేయం లేదు.
Chandrababu Comments: మహానాడు సక్సెస్ తో జోష్ మీదున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరింత దూకుడు పెంచారు. పార్టీ నేతలంతా జనంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల టూర్లు, పార్టీ కమిటీల నియామకం వంటి అంశాలపై పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
YSRCP MLC WARNING:మహానాడు సక్సెస్ జోష్ తో ఉన్న టీడీపీ నేతలు వైసీపీని టార్గెట్ చేయడంలో దూకుడు కొనసాగిస్తున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. దీంతో అచ్చెన్నాయుడిపై మండిపడుతున్నారు వైసీపీ నేతలు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెచ్చిపోయారు.
ROJA COMMENTS: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ మహానాడులో అన్నగారి జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అయితే ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో టీడీపీ నేతల తీరుపై ఏపీ మంత్రి ఆర్కే రోజా హాట్ కామెంట్స్ చేశారు.
NTR Jyanthi: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మహా నటుడు, మహా నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు.శత జయంతి వేడుకలు మొదలుకావడంతో... తెలుగురాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్నగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.
NTR Centenary Celebrations: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్నగారి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహాలు, ఫోటోలకు పులమాల వేసి నివాళి అర్పిస్తున్నారు. శత జయంతి వేడుకలకు ఏడాది పాటు నిర్వహిస్తోంది టీడీపీ.
PAWAN KALAYAN: ఆంధ్రప్రదేశ్ లో కొత్త పొత్తు పొడిచిందా? వచ్చే ఎన్నికలకు పొత్తులు ఖరారయ్యాయా? అంటే రాజకీయక వర్గాల నుంచి అవుననే తెలుస్తోంది.అయితే విపక్షంలోని అన్ని పార్టీలు కలుస్తాయా.. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయా.. లేక బీజేపీ-జనసేన-టీడీపీ మధ్య పొత్తు ఉంటుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది.
TDP MAHANADU: తెలుగుదేశం పార్టీ మహానాడు ఒంగోలులో ఉత్సాహంగా సాగుతోంది. మండువవారిపాలెంలో జరుగుతున్న టీడీపీ పండుగకు అన్ని జిల్లాల నుంచి ఆ పార్టీ నేతలు భారీగా తరలివచ్చారు.మహానాడులో ప్రారంభ ఉపన్యాసం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీపైనా హాట్ కామెంట్స్ చేశారు చంద్రబాబు.
TDP MAHANADU: మహానాడు పేరు వినగానే దివంగత నేత ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.మహానాడు అంటే తెలుగుజాతికి పండుగ అన్నారు. ఒంగోలులో నిర్వహిస్తున్న ఈ మహానాడుకు ప్రత్యేక ఉందని... టీడీపీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుందని చెప్పారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా కార్యకర్తలు ఎదురించి నిలబడ్డారని చంద్రబాబు చెప్పారు.
MLA BALAKRISHNA: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన టెన్షన్ పుట్టిస్తోంది. పోలీసులకు సవాల్ గా మారింది. తన సొంత నియోజకవర్గం హిందూపురం వెళుతున్న బాలయ్యను కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. బాలకృష్ణ వెంట వెళుతున్న వాహనాలను పోలీసులు నిలిపివేశారు.
TDP MAHANADU: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడుకు సర్వం సిద్ధమైంది. టీడీపీ పండుగకు ఒంగోలు మండువవారిపాలెంలో భారీగా ఏర్పాట్లు చేశారు. మహానాడుతో ఒంగోలు నగరమంతా పసుపుమయంగా మారింది. నగరంలోని ప్రధాని రోడ్ల వెంట స్వాగత ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టారు. ఎక్కడికక్కడ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు
టిడిపి మహానాడు 2020 ( TDP Mahanadu 2020 ) ప్రారంభమైంది. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకంటే ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ అధినేత చంద్రబాబు, పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, చిన రాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అయ్యన్నపాత్రుడు, వర్ల రామయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలుగుదేశం పార్టీ మహానాడు చాలా ఘనంగా జరపాలని.. ఏడాది కాలంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలన గురించి మహానాడు వేదిక ద్వారా ప్రజలకు వివరించాలని చంద్రబాబు భావించారట. కానీ కొరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ లాంటి పరిణామాల కారణంగా అది బాబుకు కుదిరేలా లేదు. అందుకే తెలుగు తమ్ముళ్లు చేసేదేమిలేక వర్చువల్ మహానాడు నిర్వహించాలని ఓ నిర్ణయానికొచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.