AP Schools Summer Holidays Extension: ఏపీలో వేసవి సెలవులు ఆదివారంతో ముగిసిపోనున్నాయి. సోమవారం (జూన్ 12) నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. రోహిణి కార్తె ముగిసి.. మృగశిర కార్తె వచ్చినా రాష్ట్రంలో ఎండలు ఇంకా తగ్గడం లేదు. భానుడు తపానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సీఎం జగన్‌కు ఓ రిక్వెస్ట్ చేశారు. పాఠశాలల పునఃప్రారంభాన్ని వాయిదా వేయాలని ఆయన కోరారు. సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభించాలనే ప్రభుత్వంపై మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో ఇంకా ఎండలు తగ్గలేదని.. ఇప్పటికీ అధిక ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయని గుర్తు చేశారు.
"ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూన్ రెండో వారం ముగిసిపోతున్నా.. సూర్యుడు ఇంకా భగభగమంటున్నాడు. అధిక అధిక ఉష్టోగ్రతలు నమోదవుతున్న పరిస్థితుల్లో స్కూళ్లకు హాజరయ్యే విద్యార్థులు మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. విద్యార్థులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భారీ ఎండల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఏసీ రూములను దాటి బయటికి రావడం లేదు. ఇక స్కూళ్లకు చిన్న పిల్లలు ఎలా వస్తారు..? పాఠశాలలపై ప్రారంభంపై ఉన్న శ్రద్ధ.. నాడు-నాడు పూర్తి చేయడంపై ఎందుకు లేదు..?
టీచర్లపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. రకరకాల యాప్‌లు తీసుకువచ్చి పని భారం మోపుతోంది. టీచర్లను ఇబ్బంది పెట్టడం సరికాదు. ఎండల నేపథ్యంలో మరో 10 రోజులు పాఠశాలల రీఓపెన్‌ను వాయిదా వేయాలి.." అని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కోరారు. ఈ మేరకు వేసవి సెలవులు పొడగించాలని కోరుతూ.. సీఎం జగన్‌కు ఆయన ఓ లేఖ రాశారు.
పాఠశాలలకు వేసవి సెలవులు పొడగించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కూడా కోరింది. భారీ ఎండల నేపథ్యంల ఒక వారం రోజులపాటు పునఃప్రారంభాన్ని వాయిదా వేయాలని.. లేదా ఒంటి పూట బడులు అయినా నిర్వహించాలని పేర్కొంది. సెలవుల పొడగింపుపై విద్యాశాఖకు సంఘం నేతలు లేఖ రాశారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడం.. వేసవి సెలవులు పొడగించాలని అన్ని వైపులా నుంచి డిమాండ్స్ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.
Also Read: Ind vs Aus Day 4 Highlights: గెలుపు ఊరిస్తోంది.. ఓటమి భయపెడుతోంది.. ఉత్కంఠభరితంగా డబ్ల్యూటీసీ ఫైనల్
మరోవైపు రాష్ట్రంలో మరో రెండు రోజులు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ఆదివారం 50 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు, సోమవారం 100 మండలాల్లో తీవ్ రవడగాల్పులు, 119 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Also Read: Jasprit Bumrah Comback: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. బుమ్రా రీఎంట్రీకి రెడీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook