Snake Rescue Team Catch 12 Feet Long King Cobra In Anakapalli: పాములు ముఖ్యంగా అడవులు, కొండ ప్రాంతాలు, దట్టమైన చెట్లు ఉండే ప్రాంతాలలో ఉంటాయి. పొలాలలో కూడా పాములు కన్పిస్తుంటాయి. ఎలుకలను వేటాడటం కోసం అవి వస్తుంటాయి. కొన్నిసార్లు మనుషుల ఆవాసాలలో పాములు కన్పించడం మనం చూస్తుంటాం. అడవికి దగ్గరగా ఉన్న ఇళ్లలో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. చాలాసార్లు పాములు.. మనుషుల అలికిడి విన్పించగానే అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతుంటాయి. కానీ మరికొన్నిసార్లు పాములు తమకు అపాయం అన్పించగానే కాటు వేయడానికి సైతం వెనుకాడవు. కానీ కొందరు మాత్రం పాములను దైవంగా కొలుస్తారు.
Read More: Swiggy Delivery Boy: స్విగ్గీ బాయ్ పాడుపని... పార్శీల్ డెలీవరీ ఇవ్వడానికి వచ్చి.. వైరల్ వీడియో..
పాములు కన్పించగానే వెంటనే స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తారు. పాములలో ముఖ్యంగా గిరినాగు (కింగ్ కోబ్రా) ఎంతో డెంజర్ అని చెబుతుంటారు. ఇది తనకన్న చిన్నగా ఉన్న పాములను సైతం చంపితినేస్తుందంట. అదే విధంగా దీని కాటుకు గురైతే బతికి బట్టకట్టడం కూడా చాలా వరకు డౌటే అని నిపుణులు చెబుతుంటారు. అయితే.. ఏపీలోని అనాకాపల్లి జిల్లా గిరినాగు హల్ చల్ చేసింది. స్థానికంగా ఉన్న మాడుగుల మోదమాంబ అమ్మవారి ఆలయం పరిసరాల్లో గిరినాగు భక్తులకు కన్పించింది.
వెంటనే చుట్టుపక్కల వారు అలర్ట్ అయ్యారు. ఆలయపూజారీ, అధికారులకు సమాచారం ఇచ్చారు. పామును ఎక్కడికి వెళ్లకుండా కొందరు అక్కడే నిలబడి దూరంగా చూస్తు ఉండిపోయారు. మరికొందరు మాత్రం.. ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ రెస్క్యూ వారు గిరినాగును పట్టుకొవడానికి నానా తంటాలు పడ్డారు. గిరినాగును పట్టుకొవడం మిగతా పాములంతా ఈజీ కాదు. అది పడగ విప్పి కాటు వేయడానికి సిద్ధంగా ఉంటుంది.
Read More: Snake Swallows Itself: బాప్ రే.. తన తోకను తానే మింగేస్తున్న పాము.. వైరల్ గా మారిన వీడియో..
దాదాపు మన నడుము ఎత్తు పడగవిప్పి, నాలుకను బైటకు తీస్తు కోపంగా చూస్తుంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలు పోవడం ఖాయం. అయితే.. ఫారెస్ట్ సిబ్బంది దాదాపు అరగంట పాటు ఎంతో కష్టపడి గిరినాగును చివరకు బంధించారు. ఆతర్వాత గిరినాగును జాగ్రత్తగా..సంచిలో వేసుకొని రామచంద్రాపురం సమీపంలోని అడవిప్రాంతంలో వదిలేశారు. కొందరు భక్తులు మాత్రం అమ్మవారి ఆలయంలో గిరినాగు రావడం మహిమగా చెప్పుకుంటున్నారు. అది దేవత నాగని కూడా స్థానికులు మాట్లాడుకుంటున్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter