Green Channel in Srikakulam: తాను మరణిస్తూ.. మరో ఐదుగురు జీవితాల్లో వెలుగులు నింపారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి. మౌనిక అనే యువతి రోడ్డు ప్రమాదంలో గాయపడగా.. బ్రెయిన్ డెడ్ కావడంతో.. అవయవ దానానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. గ్రీన్ చానల్‌ను ఏర్పాటు చేసి మౌనిక ఆర్గాన్స్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఆదివారం తరలించారు. కుమార్తె మృత్యువుకు చేరువ అవుతున్న బాధను దిగమింగుతూ.. అవయవ దానానికి ముందుకు వచ్చిన మౌనిక కుటుంబ సభ్యులను మానవత్వాన్ని మెచ్చుకుంటున్నారు. వివరాలు ఇలా..
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొత్త పేట గ్రామానికి చెందిన బొడిగి మౌనిక అనే యువతి గరంలోని రైతుబజార్‌కు దగ్గరలోని సచివాలయంలో VRO గా పనిస్తున్నారు. నవంబర్ 22న నగరంలోని డే అండ్ నైట్ కూడలికి సమీపంలో ఉన్న వినాయక ఆలయం వద్ద ద్విచక్ర వాహనంపై వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. స్థానికులు వెంబనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. మౌనికను ఆసుపత్రికి తరలించారు. ముందుగా శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి శ్రీకాకుళం మేడికవర్ ఆసుపత్రికి.. అనంతరం విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. మౌనికను పరిశీంచిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్టు ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
అక్కడి నుంచి మౌనికను తిరిగి శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మౌనిక ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు.. మరోసారి వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అవయవదానం చేసే అవకాశంపై వారికి వివరించారు. తమ కళ్లేదుటే కుమార్తె మృత్యువుకు చేరువ అవుతున్న బాధను తట్టుకుంటూ.. అవయవ దానానికి అంగీకరించారు. వారు అంగీకారం తెలపడంతో మౌనిక అవయవాలను తరలించేందుకు ఆదివారం శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రి నుంచి ప్రభుత్వ సాయంతో గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులను సమన్వయంతో గంటల వ్యవధిలోనే మౌనిక అవయవాలను తరలించారు. మౌనిక గుండెను విశాఖపట్నం వరకు రోడ్డు మార్గంలో తరలించి అక్కడి నుంచి విమానంలో తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఒక మూత్ర పిండంను విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి, మరొకటి శ్రీకాకుళం జెమ్స్‌లోని మరో రోగికి, రెండు కళ్లను రెడ్ క్రాస్‌కు అందించారు.
తీవ్ర విషాద సమయంలో ఎంతో గొప్ప నిర్ణయం తీసుకున్న మౌనిక తల్లిదండ్రులను అందరూ అభినందిస్తున్నారు. ప్రమాదవశాత్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయినా.. మరో ఐదుగురు జీవితాల్లో మౌనిక వెలుగులు నింపిందంటూ ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు.
Also Read: IPL 2024 Trading Window Live Updates: ఐపీఎల్ పూర్తి జట్ల వివరాలు ఇవే.. ఏ జట్టులో ఏ ప్లేయర్ అంటే..?
Also Read: RCB Retain List: వ్యాలెట్ పెరగాలంటే వేటు తప్పదు, 11 మందిని వదిలించుకున్న ఆర్సీబీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook