విజయవాడ: రాజధానిని మార్చే కుట్రతోనే అమరావతి పరిసరాల్లో కృత్రిమ వరద సృష్టించారని జగన్ సర్కార్ పై చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులను ఆయన పరామర్శించారు.
ఉద్దేశపూర్వకంగా నీటిని నిల్వ...
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వాస్తవానికి ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం 3 టీఎంసీలుగా ఉందని.. అయితే రాజధానిని మార్చాలనే ఉద్దేశంతో ఉన్న జగన్ సర్కార్... రాజధాని ప్రాంతాన్ని ముంచాలనే ఉద్దేశంతోనే ప్రమాదకరంగా 4 టీఎంసీల నీటిని బ్యారేజీలో నిల్వ ఉంచారని విమర్శలు సంధించారు. తాను ఉంటున్న ఇంటిని ముంచడానికే కుట్రపూరితంగా నీళ్లను ఆపి ఒకేసారి వదిలారని ... ఇవి కృత్రిమంగా సృష్టించిన వరదలు చంద్రబాబు ఆరోపించారు.
ఎగువ రాష్ట్రాల్లోని వరద ఇక్కడే ఎందుకు వచ్చింది..
ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో వర్షాలు కురిశాయి.... కానీ ఎక్కడ ఈ స్థాయిలో వదరలు వచ్చిన దాఖలాలు లేవన్న చంద్రబాబు...అమరావతికి వద్దే వరదలు మంచెత్తడం ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుత వరదలు సహజంగా వచ్చినవి కావని.. ప్రాజెక్టులలో కొంత నీటిని ముందే విడుదల చేసి ఉంటే వరద వచ్చేదే కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వైసీపీ సర్కార్ చేస్తున్న కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చంద్రబాబు పేర్కొన్నారు