కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసిస్తూ ప్రత్యేక హోదా డిమాండ్‌తో మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన బంద్ కొనసాగుతోంది. బంద్‌లో భాగంగా రాష్ట్రంలోని అన్నిజిల్లాలలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉదయం నుంచే ఆర్టీసీ డిపోల ముందు బైఠాయించి బస్సులను అడ్డుకుంటున్నారు. దాంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్‌లో భాగంగా షాపులు, స్కూల్స్, కాలేజీలు, వాహనాలు నడువకుండా అడ్డుకుంటున్నారు.
Vijayawada: Police detains YSR Congress Party workers who were staging protest outside Pandit Nehru bus station, over the issue of special status to #AndhraPradesh. Protestors say,"Our arrest reveals how AP CM Naidu is working for special status in the state." pic.twitter.com/hLDAjRsQGv
— ANI (@ANI) July 24, 2018
Prakasam: YSR Congress Party workers stage protest in Ongole city demanding special status for #AndhraPradesh. pic.twitter.com/Mhy8TwODPW
— ANI (@ANI) July 24, 2018
నెల్లూరు, చిత్తూరు, శ్రీకాకుళం, కర్నూలు, అనంతరపురం, ప్రకాశం, కడప, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, కృష్ణా, విశాఖపట్టణం జిల్లాల వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట వైసీపీ నేతలు, కార్యకర్తలు ధర్నాలకు దిగడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులు నిలిచిపోయాయి. పోలీసులు కొన్ని ప్రాంతాల్లో పలువురు వైసీపీ నేతలను అరెస్టు చేయడంతో అక్కడ ఆందోళనలు మిన్నంటాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బంద్‌ను జయప్రదం చేయడం ద్వారా ప్రత్యేక హోదా డిమాండ్‌ను జాతీయస్థాయికి తీసుకెళ్లాలని వైసీపీ భావిస్తోంది. కాగా రాష్ట్ర బంద్‌కు వైసీపీ మంగళవారం ఇచ్చిన పిలుపునకు తాము మద్దతు ఇవ్వడం లేదని కాంగ్రెస్, వామపక్షాలు ఓ ప్రకటనలో తెలిపాయి.