ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రభుత్వం కీలకమైన ప్రకటన జారీ చేసింది. దీర్ఘకాలంగా ఉద్యోగులు ఎదురుచూస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించింది. వేతన సంఘం ప్రకటించింది. ఆ వివరాలు మీ కోసం..
కర్ణాటక ప్రభుత్వం తదుపరి వేతన సంఘం ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 7వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం..ఉద్యోగుల జీతాలపై సమీక్ష జరపనుంది. 7వ వేతన సంఘం అమలుపై ప్రభుత్వ ప్రకటనతో లక్షలాది ఉద్యోగులు, పెన్షనర్లకు జీతం పెరుగుతుంది.
పెరగనున్న ఉద్యోగుల జీతం
ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరగనుంది. కర్ణాటక ప్రభుత్వం తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రాష్ట్రంలోని ఉద్యోగులకు కీలకమైన ప్రకటన జారీ చేశారు. కర్ణాటకరాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతంపై సమీక్షించేందుకు వేతన సంఘాన్ని నియమించింది. ఈ కమీషన్‌కు మాజీ ఛీప్ సెక్రటరీ సుధాకర్ రావ్ అధ్యక్షత వహించారు. 7వ వేతన సంఘం నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరగనుంది.
ఉద్యోగులు, పెన్షనర్లకు లాభం
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతం,పెన్షన్ రెండూ పెరగనున్నాయి. కర్ణాటక ప్రభుత్వం అక్టోబర్ నెలలోనే ఈ కమీషన్ ఏర్పాటు చేసింది.ఈ కమీషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జీతం,పెన్షన్ రెండూ నిర్ణయిస్తుంది. కర్ణాటక ప్రభుత్వం ఏడవ వేతన సంఘం ఏర్పాటు తరువాత రాష్ట్రంలోని 6 లక్షలమంది ఉద్యోగులు,పెన్షనర్లకు ఊరట కలిగింది. ఎందుకంటే ఈ విషయమై చాలాకాలంగా ఉద్యోగుల్నించి డిమాండ్ ఉంది.
Also read: Banks vs Post offices: ఫిక్స్డ్ డిపాజిట్ లేదా సేవింగ్స్‌లో బ్యాంక్స్ వర్సెస్ పోస్టాఫీసులు, ఏవి బెటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook