Success Story: కాలం ఎవరినీ ఏ దశకు మలుపు తిప్పుతుందో చెప్పలేం. కష్టాలు మనిషిని కారడవికి పంపవచ్చు.. అవే కష్టాలు కొందరిని విజయబాటను ఎక్కిస్తుంది. అలాంటి కష్టాలు.. పేదరికమే ఓ టీనేజర్ జీవితాన్ని మార్చివేశాయి. చిల్లీగవ్వ లేకుండా రైలు ఎక్కిన ఆ యువకుడు ఎవరూ లేని మహా నగరంలోకి వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ.. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగించుకుంటూ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి రాజయ్యాడు. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగాడు. ఆయనెవరో కాదు అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ. అతడి జీవితం అందరికీ ఆదర్శప్రాయం. ఆయన కష్టాలను ఎదుర్కొని ఎలా విజయవంతమయ్యాడో తెలుసుకుందాం.
Also Read: Gold Investment: ఈ సమయంలో బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చా..? లాభాలు ఉంటాయా?
అదానీ ఇంటర్నేషనల్ స్కూల్‌కు సంబంధించిన ఓ కార్యక్రమం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకలకు హాజరైన గౌతమ్ అదానీ హాజరైన ప్రేక్షకులకు తన జీవితానికి సంబంధించిన అనుభవాలు వివరించారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని వాటిని ఇతరులకు స్ఫూర్తినింపేలా ప్రసంగం చేశారు. అహ్మదాబాద్ నుంచి ముంబైకి రావడం.. మహానగరంలో ఎదుర్కొన్న కష్టాలు.. జీవిత సత్యాలను పంచుకున్నారు. గౌతమ్ అదానీ చెప్పిన ప్రకారం అతడి జీవిత కథ ఇలా ఉంది.
Also Read: Ram Charan: అల్లు వర్సెస్ కొణిదెల... అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేసిన రామ్‌చరణ్
రైలు ఎక్కి
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన గౌతమ్ అదానీ 16 ఏళ్ల యువకుడిగా జీవన పోరాటం ప్రారంభించాడు. చేతిలో రూపాయి లేక స్వస్థలం నుంచి ముంబైకి చేరుకున్నాడు. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌లో ముంబైకి రైలు ఎక్కిన సమయంలో గౌతమ్ అదానీ వద్ద డబ్బులు లేవు. ముంబైకి వచ్చాక వజ్రాల వ్యాపారం చేసే ఓ కంపెనీలో గౌతమ్ అదానీ చేరాడు. ఆ సమయంలో స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌ను నేర్చుకున్నాడు. సంపాదించిన దానిలో కొంత కొంత ట్రేడింగ్ చేస్తూ వచ్చాడు. మూడేళ్లకు మెలకువలు బాగా నేర్చుకోవడంతో ట్రేడింగ్‌లో రాణించాడు.
ట్రేడింగ్‌తో ప్రారంభం
అనంతరం 19 ఏళ్ల వయసులో ముంబైలోని జవేరి బజార్‌లో సొంతంగా గౌతమ్ అదానీ డైమండ్ ట్రేడింగ్ బ్రోకరేజీ వ్యాపారం ప్రారంభించాడు. కంపెనీ ప్రారంభంలోనే తొలిసారి జపాన్‌కు చెందిన బయ్యర్ తొలి ట్రేడ్ నిర్వహించాడు. ఈ ట్రేడింగ్‌తో గౌతమ్ అదానీ జీవితం మారిపోయింది. తొలి ట్రేడ్ ద్వారా రూ.10 వేలు కమీషన్ రూపంలో వచ్చింది. అనంతరం ట్రేడింగ్‌లో గౌతమ్ అదానీ విజయవంతమయ్యాడు.
కుటుంబంతో కలిసి కంపెనీ
1981లో సోదరుడు మహాసుఖ్ భాయ్‌కి సహాయం చేసేందుకు గుజరాత్‌కు తిరిగివచ్చాడు. అనంతరం పీవీసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్వహించారు. ఏడేళ్ల తర్వాత 1988లో అదానీ ఎక్స్‌పోర్ట్స్ పేరిట కమొడిటీ ట్రేడింగ్ వెంచర్‌ను గౌతమ్ అదానీ కుటుంబం ప్రారంభించింది. ఆ సంస్థ 1994లో స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ అయ్యింది. ఇప్పుడు ఆ సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌గా మారింది. అక్కడితో ప్రారంభమైన వ్యాపార సామ్రాజ్యం పలు రంగాలకు విస్తరించి ఇప్పుడు దేశంలోనే అగ్ర సంస్థగా అదానీ గ్రూప్ రూపుదాల్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.