iPhone SE 3: ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో విడుదల చేసిన బడ్జెట్ మోడళ్లు ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ ఎస్ఈ 2 (2020)లకు కొనసాగింపుగా ఈ ఫోన్ రానుంది.
ఈ కొత్త బడ్జెట్ మోడల్‌ను ఐఫోన్ ఎస్ఈ 3 (2022) పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశముంది. ఈ మోడల్ 5జీ వేరియంట్‌గా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
విడుదల ఎప్పుడంటే..
ఈ స్మార్ట్‌ఫోన్‌ను 2022 మార్చి 8న మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశముంది. యాపిల్ నిర్వహించే స్పింగ్ ఈవెంట్లో దీనిని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని టెక్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఐఫోన్ ఎస్ఈ 3 ఫీచర్లు..
4.7 అంగుళాల డిస్ప్లే
64 జీబీ స్టోరేజ్
3 జీబీ ర్యామ్
12 ఎంపీ మెయిన్ కెమెరా
12 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
యాపిల్ ఏ 15 బయోనిక్ చిప్సెట్
2821 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సహా వివిధ ఫీచర్లు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.
ధర ఎంత?
గత ఏడాది మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ ఎస్2తో పోల్చితే మరిత తక్కువ ధరకే ఈ కొత్త మోడల్ అందుబాటులోకి వచ్చే అవకాశముందట. ఈ ఫోన్‌ను 300 డాలర్లకు అందుబాటులోకి తేవాలని యాపిల్ భావిస్తోందట. ఇండియాలో దీని ధర రూ.22,517గా ఉండొచ్చు.
ఐఫోన్ ఎస్ఈ 2 ధర 399 డాలర్లుగా ఉంది. ఈ మోడల్ ధర రూ.29,947గా ఉంది.
అయితే యాపిల్ నుంచి మాత్రం ఈ ఫోన్ గురించి ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు. ఈ ఫోన్ తెస్తోంది అనే విషయం తప్ప.. ఫీచర్లు, ధర, విడుదల తేదీ వంటి వివరాలను చెప్పలేదు యాపిల్.
Also read: Gold Rate Today 26 February 2022: మగువలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు!!
Also read: Redmi Note 11 Pro launch: మార్చ్ 9న ఇండియాలో లాంచ్ కానున్న రెడ్మి నోట్ ప్రో- ప్రో ప్లస్ , ధర ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook