PPF Benefits: పీపీఎఫ్‌లో ఆకర్షణీయమైన వడ్డీ, ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. 15 ఏళ్ల మెచ్యూరిటీతో ఉండే ఈ పధకం ఇన్వెస్ట్‌మెంట్‌కు చాలా మంచి ఆప్షన్. ఈ పధకం ద్వారా నెలకు 5 వేలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ అనంతరం 26 లక్షలు పొందవచ్చు ఆ వివరాలు ఇలా..
వడ్డీ రూపంలో మంచి రిటర్న్స్ పొందాలన్నా లేదా రిస్క్ లేని పెట్టుబడి పెట్టాలన్నా పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ చాలా మంచి ఆప్షన్. ప్రతి భారతీయుడు ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. దేశంలోని అన్ని బ్యాంకులు, పోస్టాఫీసులు ఈ పధకాన్ని అందిస్తున్నాయి. ఇందులో ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుంది. 15 ఏళ్ల కాల పరిమితి తరువాత ఇన్వెస్ట్‌మెంట్ పెంచవచ్చు. కనీసం 5 వేలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ అనంతరం 26 లక్షల రూపాయలు పొందవచ్చు. మెచ్యూరిటీ తరువాత మూడు ఆప్షన్లు ఉంటాయి. మొదటిది మీ నగదు విత్ డ్రా చేసుకోవడం. రెండవది విత్ డ్రా చేయకున్నా వడ్డీ పడుతుంటుంది. మూడవది మరో 5 ఏళ్లకు పొడిగించడం.
మెచ్యూరిటీ తరువాత విత్ డ్రా చేయడం
పీపీఎఫ్ ఎక్కౌంట్ మెచ్యూరిటీ తరువాత మీరు డిపాజిట్ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా విత్ డ్రా చేసుకోవచ్చు. ఎక్కౌంట్ క్లోజ్ చేయాలంటే మరో ఎక్కౌంట్‌కు మీ డబ్బులు బదిలీ అవుతాయి. మీరు డిపాజిట్ చేసిన డబ్బులు, వడ్డీ మొత్తం ట్యాక్స్ మినహాయింపుతో ఉండటం లాభదాయకం. అంతేకాకుండా 1.5 లక్షల వరకూ ట్యాక్స్ ఉండదు.
5 ఏళ్లకు పీపీఎఫ్ ఎక్కౌంట్ పొడిగించడం
మెచ్యూరిటీ పూర్తయ్యాక ఐదేళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు. మరో ఐదేళ్లు పొడిగించాలంటే సంబంధిత బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు 1 ఏడాది ముందు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఐదేళ్లు పొడిగించిన తరువాత ఎప్పుడైనా సరే విత్ డ్రా చేయాలనుకుంటే చేసుకోవచ్చు.
మెచ్యూరిటీ తరువాత
మొదటి రెండు ఆప్షన్లు ఎంచుకోకపోతే మెచ్యూరిటీ తరువాత కూడా ఎక్కౌంట్ కొనసాగుతుంది. మీరు నెల నెలా ఇన్వెస్ట్ చేయకపోయినా సరే దానికదే మరో ఐదేళ్లకు పొడిగించబడుతుంది. దానిపై వడ్డీ లభిస్తూ ఉంటుంది. ప్రస్తుతం పీపీఎఫ్ ఎక్కౌంట్‌పై 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఏడాదికోసారి లెక్కించి ఇస్తారు. వడ్డీ మారేది మాత్రం ప్రతి త్రైమాసికానికి ఓసారి. ఇదే.
Also read: Visa Free Countries: పాస్‌పోర్ట్ ఉందా, అయితే ఈ దేశాలకు వీసా లేకుండా చుట్టి రావచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
PPF Benefits: నెలకు 5 వేలు డిపాజిట్..మెచ్యూరిటీ తరువాత 26 లక్షలు ఎలాగంటే..