Best Prepaid Reharge Plans: లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్స్‌తో కస్టమర్స్‌కు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ప్రతీ నెలా రూ.296, రూ.299 వంటి ప్లాన్స్‌తో రీఛార్జ్ చేయించుకోవడం కన్నా ఒకేసారి ఏడాది ప్లాన్‌ని రీఛార్జ్ చేసుకుంటే భారీ మొత్తంలో ఆదా అవుతుంది. అంతేకాదు, కొన్ని అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ప్రస్తుతం టెలికాం ఆపరేటర్స్ రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ) కస్టమర్స్‌కు ఏడాది వాలిడిటీతో కూడిన బెస్ట్ ప్లాన్స్ అందిస్తున్నాయి. ఆ ప్లాన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...
ఎయిర్‌టెల్ రూ.2999 ప్రీపెయిడ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ.2999 ప్రీపెయిడ్ ప్లాన్‌కు 365 రోజుల వాలిడిటీ ఉంటుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు చేసే సదుపాయం పొందుతారు. అంతేకాదు మూడు నెలల పాటు ఉచితంగా అపోలో 24/7 మెంబర్‌షిప్, రూ.100 ఫాస్టాగ్ క్యాష్ బ్యాక్, ఉచిత హలో ట్యూన్స్, ఉచిత మ్యూజిక్ పొందుతారు. రోజు వారీ డేటా పరిమితి అయిపోతే.. నెట్ స్పీడ్ 64కేబీపీఎస్‌కి తగ్గుతుంది. అలాగే, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల పరిమితి దాటితే.. ఆ తర్వాత ఒక్కో లోకల్ ఎస్ఎంఎస్‌కు రూ.1, ఎస్టీడీ ఎస్ఎంఎస్‌కు రూ.1.5 చొప్పున ఛార్జీ పడుతుంది.
రిలయన్స్ జియో రూ.2879 ప్లాన్ :
రిలయన్స్ జియో రూ.2879 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు వాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్స్ మొత్తం 730 జీబీ డేటా పొందుతారు. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందుతారు. అంతేకాదు, జియో టీవీ, జియో సినిమా, జియోసెక్యూరిటీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. డేటా పరిమితి దాటితే నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కి తగ్గుతుంది.
వొడాఫోన్ ఐడియా (వీఐ) రూ.3099 ప్లాన్ :
ఎయిర్‌టెల్, జియోతో పోలిస్తే వీఐ వన్ ఇయర్ ప్లాన్ కాస్త ఖర్చు ఎక్కువే. వీఐ అందించే రూ.3099 ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్స్‌కి అన్‌లిమిటెడ్ కాల్స్,రోజుకు 3జీబీ డేటా, ప్రతీ నెలా 2జీబీ బ్యాకప్ డేటా పొందుతారు. అలాగే వీఐ మూవీస్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందుతారు.
తక్కువ ధరలో ఏడాది వాలిడిటీ కావాలంటే జియో రూ.2879 ప్లాన్‌ని ఎంచుకోవడం బెటర్. లేదంటే ఎయిర్‌టెల్ రూ.2999 ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కావాలనుకుంటే వీఐ రూ.3099 ప్లాన్‌ని ఎంపిక చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook