Maruti Suzuki Dzire is November 2022 Best selling sedan car: ఎస్‌యూవీ మరియు హ్యాచ్‌బ్యాక్‌లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ సంవత్సరంలో భారతీయ మార్కెట్లో సెడాన్ కార్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పాలి. మారుతి సుజుకి నుంచి 6.5 లక్షల కారు ప్రతి నెలా బెస్ట్ సెల్లింగ్ 'సెడాన్' టైటిల్‌ను గెలుస్తోంది. 2022 నవంబర్ నెలలో కూడా 14 వేల మందికి పైగా వినియోగదారులు ఈ వాహనాన్ని కొనుగోలు చేశారు. టాప్ 10 కార్ల అమ్మకాల జాబితాలో ఇది 6వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం అత్యధికంగా ఆమ్ముడవుతున్న మారుతీ బ్రెజా, హ్యుందాయ్ క్రెటా మరియు టాటా పంచ్‌లు కూడా ఈ కారు కంటే తక్కువ అమ్ముడయ్యాయి. అది ఏ కారో తెలుసుకుందాం.
2022 నవంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన కారు మరోదో కాదు.. మారుతీ సుజుకి డిజైర్. ఇది చాలా కాలంగా భారత దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 'సెడాన్' కారుగా కొనసాగుతోంది. ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినా మారుతీ సుజుకి డిజైర్ క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు మారుతీ సుజుకి కంపెనీ.. డిజైర్ మోడల్‌ను తీసుకొస్తుండడం కూడా కలిసొస్తుందనే చెప్పాలి. 2022 నవంబర్‌లో కూడా 14,456 యూనిట్లను కొనుగోలు చేశారు. 2021 నవంబర్‌తో పోలిస్తే.. మారుతీ సుజుకి డిజైర్ విక్రయాల్లో 76% వృద్ధి రేటు నమోదు అయింది. 2021లో 8,196 యూనిట్లు అమ్ముడయ్యాయి.
మారుతి సుజుకి డిజైర్ ప్రారంభ ధర రూ. 6.24 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. డిజైర్ టాప్ మోడల్ ధర రూ. 9.18 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇందులో పెట్రోల్ (Petrol Engine) ఇంజన్‌తో పాటు సీఎన్జీ (CNG Engine) ఆప్షన్ కూడా ఉంది. సీఎన్జీతో 31KM కంటే ఎక్కువ మైలేజ్ వస్తుంది. సామాన్యులకు అందుబాటులో డిజైర్ ధర ఉండడంతో ఎప్పటినుంచో ఈ కారు బాగా అమ్ముడుపోతుంది.
దేశంలో విక్రయించబడుతున్న మిగిలిన సెడాన్ కార్ల పరిస్థితి దారుణంగా ఉంది. రెండవ నంబర్ సెడాన్ కారు టాటా టిగోర్. నవంబర్ నెలలో ఇది కేవలం 4,301 యూనిట్లను మాత్రమే విక్రయించింది. డిజైర్ మరియు టిగోర్ విక్రయాలలో దాదాపు 10 వేల యూనిట్ల వ్యత్యాసం ఉంది. నవంబర్ మాసంలో 3,890 యూనిట్లను మాత్రమే విక్రయించిన హోండా అమేజ్.. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది.
Also Read: Delhi School Girl Acid Attack: రాజధాని ఢిల్లీలో దారుణం.. స్కూల్ విద్యార్థినిపై యాసిడ్ దాడి!
Also Read: లక్ష్మీనారాయణ యోగం.. ఈ 3 రాశుల వారికి అదృష్టమే! కొత్త సంవత్సరంలో ప్రమోషన్‌తో పాటు ధనలాభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.