Income tax Updates: కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ట్యాక్స్ పేయర్లకు శుభవార్త అందించింది. ఇక నుంచి ఏడాది ఆాయం 10 లక్షల రూపాయల వరకూ ఉంటే ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే దీనికోసం కొన్ని పద్ధతులు అనుసరించాల్సి ఉంటుంది. సరైన ప్లానింగ్ ఉండాలి.
వాస్తవానికి 2023 బడ్జెట్ ప్రకారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక ఆదాయం 7 లక్షల వరకూ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. అయితే అంతకంటే ఆదాయం ఎక్కువ ఉండేవాళ్లకు టీడీఎస్ భారీగా కట్ అవడంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే సరైన ప్లానింగ్‌తో కొన్ని విధానాలు అనుసరిస్తే 10 లక్షల వరకూ ఆదాయం ఉన్నా ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదంటున్నారు. ప్లానింగ్ సరిగ్గా ఉండాలంటున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.
10 లక్షల వరకూ నో ట్యాక్స్
ప్లానింగ్ సరిగ్గా ఉంటే మీ వార్షిక ఆదాయం 10 లక్షల రూపాయల వరకూ ఉన్నా సరే ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరముండదు. పది లక్షల రూపాయల వరకూ ట్యాక్స్ మినహాయింపు ఉండాలంటే పాత ట్యాక్స్ విధానం ఎంచుకోవల్సి ఉంటుంది. కొత్త ట్యాక్స్ విధానంలో బేసిక్ ట్యాక్స్ మినహాయింపు పరిధిని గత బడ్జెట్‌లో పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. పాత ట్యాక్స్ విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ పాత ట్యాక్స్ విధానంలో హోమ్ లోన్ నుంచి ఇన్సూరెన్స్ పాలసీ వరకూ ట్యాక్స్ సేవింగ్ వెసులుబాటు ఉండనే ఉంది. ప్లానింగ్ సరిగ్గా ఉంటే వార్షిక ఆదాయం 10 లక్షల వరకూ ఉన్నా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని ట్యాక్స్ నిపుణులు చెబుతున్నారు. పాత ట్యాక్స్ విధానం ఎంచుకోవల్సి ఉంటుంది.
ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 80 సి ప్రకారం పాత ట్యాక్స్ విధానంలో ఈపీఎఫ్, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎన్ఎస్‌సిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏడాదికి 1.5 లక్షలు మినహాయింపు పొందవచ్చు. అంటే వార్షిక ఆదాయం 10 లక్షలుంటే ఈ విధానం ద్వారా 1.5 లక్షలు తగ్గి 8.5 లక్షలౌతుంది. ఇది కాకుండా నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి ద్వారా మరో 50 వేలు ఆదా చేయవచ్చు. సెక్షన్ 80 సిసిడీ వర్తిస్తుంది. ఏదైనా హౌస్ లోన్ తీసుకుంటే మరో 2 లక్షల వరకూ మినహాయింపు పొందవచ్చు. ఇక మెడికల్ పాలసీ ఏదైనా తీసుకుంటే మరో 25 వేలు తగ్గుతుంది. మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు అయితే వారి పేరుపై హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మరో 50 వేలు తగ్గించుకోవచ్చు.
ఇన్‌కంటాక్స్ ఆదాయపు చట్టం ప్రకారం 5 లక్షల రూపాయల ఆదాయంపై 12,500 రూపాయలు ట్యాక్స్ ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 87 ఏ ప్రకారం 12,500 రూపాయలు రిబేట్ లభిస్తుంది. అన్ని డిడక్షన్స్ మినహాయిస్తే మీ ఆదాయం 10 లక్షల నుంచి 5 లక్షలకు చేరుతుంది. దాంతో ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.
Also read: LPG Price Change: ఎల్బీజీ గ్యాస్ సిలెండర్ ధరల్లో మార్పు, ఇవాళ్టి నుంచి కొత్త ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook