EPFO Latest Rules: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. చాలా ఏళ్లుగా వేతన పరిమితిని పెంచాలని డిమాండ్లు ఉండగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. చివరగా జీతం పరిమితి 2014లో సవరణ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు రూ.6500 నుండి రూ.15000కి పెంచింది. ఇప్పుడు మరోసారి సవరణ చేస్తే.. రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తుందోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.
Also Read: Lok Sabha 2024 Elections: 2024 లోక్ సభకు బీజేపీ తరుపున పోటీ చేస్తోన్న సినిమా హీరోలు వీళ్లే..
కొత్త పరిమితిని తీసుకువస్తే.. ప్రభుత్వంతోపాటు ప్రైవేట్ రంగంపై కూడా భారం పడుతుంది. అయితే ఉద్యోగులకు మాత్రం మేలు జరుగుతుంది. సాధారణంగా ఎంప్లాయి వాటాగా శాలరీలో నుంచి 12 శాతం పీఎఫ్ కింద కట్ అవుతుంది. యజమాని 12 శాతం జమ చేస్తారు. ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్ అకౌంట్‌లోకి యజమాని వాటా నుంచి 8.33 శాతం పెన్షన్ స్కీమ్‌లోకి, మిగిలి అమౌంట్ ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం గరిష్ట వేతన పరిమితిని పెంచితే.. ఆ మేరకు ఉద్యోగి వాటాతోపాటు యజమాని వాటా కూడా పెరుగుతుంది. ఈ మొత్తం చివరకు ఉద్యోగికి సంబంధించిన ఈపీఎఫ్ ఖాతాలోకి చేరుతుంది. రిటైర్మెంట్ సమయానికి ఎక్కువ పీఎఫ్ అమౌంట్ నిల్వ ఉంటుంది.
మరోవైపు ఏప్రిల్ నెల నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక నుంచి మీరు ఉద్యోగం మారిన ప్రతిసారి పాత కంపెనీలో అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు ఫామ్ నింపాల్సిన అవసరం లేదు. మీరు ఉద్యోగం మారిన తరువాత పీఎఫ్ అమౌంట్ ఆటోమేటిక్‌గా బదిలీ అవుతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోకి వచ్చే సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ సేవింగ్స్ స్కీమ్‌గా పనిచేస్తుంది.
పీఎఫ్ వడ్డీ లెక్క ఇలా..
ఉద్యోగి బేసిక్ జీతం, డియర్‌నెస్ అలవెన్స్ రూ.15 వేలు, వడ్డీ రేటు 8.25 శాతంగా పరిగణిస్తే..
==> బేసిక్ శాలరీ+ DA = రూ 15 వేలు
==> ఈపీఎఫ్‌కు ఉద్యోగుల సహకారం = రూ.15 వేలలో 12% = రూ.1,800
==> ఈపీఎఫ్‌కు యజమాని సహకారం = రూ.15 వేలలో 8.33% = రూ.1,250
==> ఉద్యోగి ఈపీఎఫ్‌లో యజమాని సహకారం=రూ.15 వేలలో 3.67% = సుమారు రూ. 550
==> మొత్తం సహకారం = రూ 2,350
==> ప్రస్తుత వడ్డీ రేటు= ఏడాదికి 8.25%
==> వడ్డీ నెలవారీ నిర్వహణ బ్యాలెన్స్‌పై లెక్కింస్తారు. అంటే నెలకు వడ్డీ = 8.5%/12 = 0.7083%
==> మొదటి నెలలో ఈపీఎఫ్‌పై వడ్డీ లేదు
==> రెండో నెల సహకారం = రూ 2,350
==> మొత్తం ఈపీఎఫ్ బ్యాలెన్స్ = రూ.4,700.
Also Read: Tatikonda Rajaiah: వరంగల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook