How to Change Exit Date on EPFO Website: చాలా మంది ప్రైవేట్ ఉద్యోగులు కెరీర్‌లో ఎదుగుదల కోసం.. ఎక్కువ శాలరీ కోసం కంపెనీలన మారుతూ ఉంటారు. ఇలా ఉద్యోగం మారిన ప్రతిసారి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) అకౌంట్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత కంపెనీలో ఎగ్జిట్ ఫార్మాలిటీస్ విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. పీఎఫ్‌కు సంబంధించి గతంలో పనిచేసిన కంపెనీ నుంచి క్లియరన్స్‌కు చిక్కులు ఏర్పడుతున్నాయి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమస్యలకు చెక్ పెడుతూ ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్‌డేట్ చేసే అధికారం కంపెనీలకే ఉండగా.. ఇక నుంచి ఉద్యోగులకు కూడా ఉందని తెలిపింది. ఉద్యోగులే ఆన్‌లైన్ తమ డేటాను అప్‌డేట్ చేసుకోవచ్చని ఇటీవల ట్విట్టర్‌లో పేర్కొంది.
ఒక ఉద్యోగి కంపెనీ మారితే.. కొత్త జాయిన్ కంపెనీలోకి తన పీఎఫ్ అకౌంట్‌ను కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త కంపెనీలో కూడా కొత్త పీఎఫ్ ఐడీని తీసుకోవాలి. అప్పుడే పాత కంపెనీ అకౌంట్ నుంచి పీఎఫ్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. కంపెనీని మారిన తరువాత డేట్ ఆఫ్ ఎగ్జిట్‌ను రెండు నెలలలోపు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ ఎగ్జిట్‌ని అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారు ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చని ఈపీఎఫ్‌ఓ తెలిపింది.
డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇలా అప్‌డేట్ చేసుకోండి
==> ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి
==> మీ యూఏఎన్ నంబంరు, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి
==> మెనేజ్ ట్యాబ్‌పై క్లిక్ చేసి.. మార్క్ ఎగ్జిట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
==> కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. తరువాత సెలక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆప్షన్ వద్ద ఉన్న డ్రాప్‌డౌన్ లిస్టుపై క్లిక్ చేయండి
==> ఇక్కడ మీరు పనిచేసిన కంపెనీలకు సంబంధించిన పీఎఫ్ అకౌంట్లు ఉంటాయి. ఇందులో నుంచి మీరు చివర పనిచేసిన కంపెనీ పీఎఫ్ అకౌంట్ నంబర్‌ను ఎంచుకోవాలి.
==> మీ కంపెనీలో లాస్ట్ వర్కింగ్ డే డేట్‌ను ఎంటర్ చేయండి.
==> అదే తేదీని మళ్లీ ఎంటర్ చేసి.. కంపెనీ నుంచి బయటకు వచ్చిన కారణాన్ని ఎంటర్ చేయండి.
==> తరువాత ఓటీపీని పొందడానికి Send OTPపై క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.
==> అనంతరం చెక్ బాక్స్‌పై క్లిక్ చేసి.. అప్‌డేట్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.
Also Read: Team India: బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీకి రెడీ.. ఆ బౌలర్ మాత్రం ఎప్పుడంటే..!
Also Read: AP Team in IPL: ఐపీఎల్‌లో ఏపీ టీమ్.. రూట్ మ్యాప్ సిద్ధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి