Gold Price Today September 4th 2022 : వరుసగా మూడు రోజులు దిగొచ్చిన బంగారం ధర ఇవాళ (సెప్టెంబర్ 4) స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 మేర ధర పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,890గా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలను ఇప్పుడు పరిశీలిద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:
హైదరాబాద్ సహా ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలలో దాదాపుగా ఎప్పుడూ ఒకే ధరలు కొనసాగుతాయి. ఇవాళ కూడా ఈ 3 నగరాల్లో ధరలు ఒకేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూడు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,890గా ఉంది.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,050గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,890గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,220గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,510గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,940గా ఉంది.
మహారాష్ట్రలోని పుణే, గుజరాత్‌లోని వడోదరా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,920గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,890గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది. గడిచిన 10 రోజుల్లో 5 సార్లు తగ్గిన బంగారం ధర 4 సార్లు పెరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా బంగారం ధరలు బలహీనంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ బంగారం ధర 12 శాతం మేర తగ్గింది. రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా బంగారం ధరలపై జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా వివిధ నగరాల్లోని ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. బంగారం కొనుగోలు చేయాలనుకునే కస్టమర్స్ కచ్చితమైన ధర కోసం నేరుగా స్థానిక జ్యువెలరీ వ్యాపారులను సంప్రదించండి. అంతర్జాతీయ మార్కెట్, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, డాలరుతో రూపాయి మారకం విలువ, దేశాల మధ్య సంబంధాలు తదితర కారణాలతో బంగారం రేటు ఎప్పటికప్పుడు మారుతుంటుంది.
Also Read: వివాదంపై స్పందించిన బండ్ల.. ఎన్టీఆర్ ను కూడా ప్రేమిస్తున్నానంటూ !
Also Read: ఇక నేను రంగంలోకి దిగుతున్నా.. బీజేపీ 50 సీట్లకు పడిపోవడం ఖాయం.. నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook