Tax Exemptions: 2020 బడ్జెట్‌లో ఇన్‌కంటాక్స్ విధానంలో చేసిన మార్పులతో కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టారు. 2023 బడ్జెట్‌లో ఈ కొత్త ట్యాక్స్ విధానంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. 7 లక్షల వరకూ ఆదాయంపై ట్యాక్స్ మినహాయింపు లభించింది. ఇక ఆ తరువాత కూడా మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం కొత్త ట్యాక్స్ విధానంపై తరచూ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. 2023-24 ఆర్ధిక సంవత్సరం నుంచి కొత్త ట్యాక్స్ విధానాన్ని డీఫాల్ట్ ట్యాక్స్ విధానంగా చేశారు. అంటే ఇన్వెస్ట్‌మెంట్ ట్యాక్స్ చెల్లింపు లేదా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు కొత్త ట్యాక్స్ విధానం డీఫాల్ట్ అవుతుంది. రానున్న కాలంలో న్యూ ట్యాక్స్ విధానమే ఏకైక విధానంగా మార్చవచ్చని తెలుస్తోంది. అంటే పాత ట్యాక్స్ విధానాన్ని తీసివేయవచ్చు. అయితే కొత్త ట్యాక్స్ విధానంలో కొన్ని మార్పులు చేయవచ్చని తెలుస్తోంది.
న్యూ ట్యాక్స్ రెజిమ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కొన్ని మార్పులు చేయవచ్చు. ఏ ఉద్యోగికైనా అత్యంత ముఖ్యమైంది ఈపీఎఫ్. కొత్త ట్యాక్స్ విధానంలో ఈపీఎఫ్ చేర్చే అవకాశముంది. ఇప్పటి వరకూ ఈపీఎఫ్‌ను సెక్షన్ 80సి ప్రకారం పాత ట్యాక్స్ విధానంలో చేర్చవచ్చు. సెక్షన్ 80 సి ప్రకారం 1.5 లక్షల వరకూ ట్యాక్స్ మినహాయింపు ఉంది. ఇప్పుడు కొత్త ట్యాక్స్ విధానంలో సెక్షన్ 80సి చేర్చవచ్చు. అయితే సెక్షన్ 80సిను కొత్త ట్యాక్స్ విధానంలో చేరుస్తారా లేక అదనంగా ట్యాక్స్ మినహాయింపు ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.
కొత్త ట్యాక్స్ విధానం అమలు చేసేటప్పుడు క్రమంగా దీనిపైనే ఫోకస్ పెట్టనున్నారు. ఇందులో భాగంగా ముందు స్టాండర్డ్ డిడక్షన్ జోడించారు. ఇప్పుడు త్వరలో ఈపీఎఫ్ యాడ్ చేసే అవకాశాలున్నాయి. సెక్షన్ 80 సి ప్రకారం అదనంగా ట్యాక్స్ మినహాయింపు రావచ్చు. 2023లో కొత్త ట్యాక్స్ విధానంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. కనీస ట్యాక్స్ మినహాయింపు 2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెరిగింది. ఇక రిబేట్‌తో కలుపుకుని ట్యాక్స్ మినహాయింపును 5 లక్షల్నించి 7 లక్షలకు పెంచారు. ఇందులో 50 వేల రూపాయలు స్టాండర్డ్ ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది. అంటే 7.5 లక్షల వరకూ ఎలాంటి ట్యాక్స్ ఉండదు.
కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను వివరాలు
కొత్త ట్యాక్స్ విధానంలో నుంచి 3 లక్షల వరకూ ఆదాయం ఉంటే ఎలాంటి ట్యాక్స్ లేదు. 3-6 లక్షల ఆదాయంపై 5 శాతం ట్యాక్స్ చెల్లించాలి. అదే 6-9 లక్షల ఆదాయంపై 10 శాతంం ట్యాక్స్ ఉంటుంది. ఇక 9-12 లక్షల ఆదాయంపై 15 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అదే 12-15 లక్షల ఆదాయమైతే 20 శాతం ట్యాక్స్ ఉంటుంది.
Also read: CBSE Board Exam: సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో మార్పు, కొత్త షెడ్యూల్ ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook