HDFC Bank FD rates: దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీ) వడ్డీ రేట్లను పెంచినట్లు (HDFC Bank Hike interest rates on FDs) ప్రకటించింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగినట్లు తెలిసింది. రెండేళ్లకన్నా ఎక్కువ మెచ్యూరిటీ పీరియడ్ ఉన్న ఎఫ్డీలకు మాత్రమే పెరిగిన వడ్డీ రేట్లు వర్తిస్తాయని కూడా (HDFC Bank new Interest rates)వెల్లడైంది.
కొత్త ఎఫ్డీ రేట్ల గురించి (HDFC Bank FD rates)..
పెరిగిన ఎఫ్డీ రేటర్లు జనవరి 12 నుంచి అమలులో ఉంటాయని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది.
2 ఏళ్ల నుంచి మూడేళ్ల వ్యధి ఉన్న ఎఫ్డీపై 5.20 శాతం వడ్డీ రేటును ఇవ్వనుంది హెచ్డీఎఫ్సీ బ్యాంక్.
3-5 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఉన్న ఎఫ్డీలపై వడ్డీరేటను 5.40 శాతానికి పెంచింది.
5-10 ఏళ్ల వరకు వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఏకంగా 5.60 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది హెచ్డీఎఫ్సీ బ్యాంక్
రెండేళ్లకన్నా తక్కువ వ్యవధి ఉన్న ఎఫ్డీలపై వడ్డీ రేట్లు ఇలా..
- 7-14 రోజుల వ్యవధి ఉండే ఎఫ్డీపై వడ్డీ రేటు 2.50 శాతంగా ఉంది.
- 15-29 రోజుల పీరియడ్ గల ఎఫ్డీలకు 2.50 శాతం వడ్డీ లభిస్తోంది.
- 30-45 రోజుల వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేటు 3 శాతం.
- 61-90 రోజుల కాల పరిమితి ఉన్న ఎఫ్డీపై వడ్డీ రేటు 3 శాతంగా ఉంది.
- 91 రోజుల నుంచి 6 నెలల వ్యవధితో కూడిన ఎఫ్డీకి వడ్డీ రేటును 3.5 శాతంగా నిర్ణయించింది బ్యాంక్.
- 6 నెలల 1 రోజు నుంచి 9 నెలల వరకు వ్యవధి ఉన్న ఎఫ్డీపై వడ్డీ రేటు 4.4 శాతం.
- 9 నెలల 1 రోజు నుంచి ఏడాదిలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేటు 4.4 శాతంగా ఉంచింది బ్యాంక్.
- ఏడాది నుంచి రెండేళ్ల వరకు వ్యవధి ఉన్న ఎఫ్డీపై వడ్డీ రేటు 5 శాతంగా నిర్ణయించింది హెచ్డీఎఫ్సీ బ్యాంక్.
Also read: Flipkart, Amazon sale: రేపటి నుంచే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రిపబ్లిక్ డే సేల్.. ఆఫర్లు ఇవే..
Also read: Tesla and KTR Tweet: ఎలాన్ మస్క్‌కు మంత్రి కేటీఆర్ ట్వీట్‌పై పెరుగుతున్న మద్దతు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook