Union Budget 2022 Highlights: 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. వరుసగా నాలుగో ఏడాది నిర్మలమ్మ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. లోక్‌సభ రేపటికి వాయిదా పడడంతో.. ఆర్థిక మంత్రి ప్రసంగం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. ఈ బడ్జెట్లో ముఖ్యాంశాలను ఓసారి పరిశీలిద్దాం.
బడ్జెట్ 2022లోని హైలైట్స్ ఇవే:
# రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాలు
# త్వరలో నదుల అనుసంధానం
# ఐఐటీలలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు
# పెన్నా-కావేరి, కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా అనుసంధానం
#ఇంటింటికి నీటి పథకానికి రూ.60 వేల కోట్లు కేటాయింపు
# మానసిక సమస్యల చికిత్స కోసం ఆన్లైన్ టెలీమెడిసిన్ విధానం
# ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (పీఎంఏవై) ద్వారా 80 లక్షల నిర్మాణాలు
# త్వరలో 5 జీ టెక్నాలజీ సేవలు, 2022 నాటికి 5 జి స్ప్రెక్టమ్ వేలం
# 4 ప్రాంతాల్లో లాజిస్టిక్ పార్క్‌లు
# మేకిన్ ఇండియాలో భాగంగా 60 లక్షల ఉద్యోగాల కల్పన
# స్టార్టప్‌ల కోసం రూ.2 లక్షల కోట్లు
#డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహకాలు
# వంట నూనె దేశీయంగా ఉత్పత్తి చేసేలా చర్యలు
# ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల అమ్మకానికి ప్రత్యేక ఫ్లాట్‌ఫామ్ ఏర్పాటు
#ఈ ఏడాది 4 అంశాలపై అత్యధిక ఫోకస్
# క్రెడిట్ గ్యారంటీ పథకానికి రూ.2 లక్షల కోట్లు
# అభివృద్ధి ఆధారిత పెట్టుబడు, పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహకాలు
# 1 నుంచి 12వ తరగతి వరకూ ప్రత్యేక ఛానెల్స్ ఏర్పాటు
# 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు
# త్వరలో డిజిటల్ చిప్‌లతో కూడిన ఈ పాస్‌పోర్ట్‌లు జారీ
# చిన్న, మధ్య తరహ పరిశ్రమలకు క్రెడిట్ గ్యారెంట్ పథకం కింద రూ.2 లక్షల కోట్లు
# వచ్చే 3 ఏళ్లలో 400 కొత్త వందే భారత్ రైళ్లు
# ప్రధాని గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి
# ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి ప్రోత్సాహకాలు
# సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం
# 2025 నాటికి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్
# దేశ వృద్ధి రేటు 9.5 శాతంగా ఉంటుందని అంచనా
# గత రెండేళ్లలో 5.5 కోట్ల కుటుంబాలకు కుళాయి ద్వారా తాగునీరు సౌకర్యం
# 2 లక్షల అంగన్వాడీ కేంద్రాల అప్‌గ్రెడేషన్
# పబ్లిక్-ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు
# డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు
# ప్రాజెక్టులో భాగంగా 8 రోప్ వేలు నిర్మాణం. 60 కిలోమీటర్ల దూరంలో ఒక్కో రోప్ వే నిర్మాణం
# వచ్చే ఐదేళ్లలో ఆత్మ నిర్బర్ భారత్ పథకం వల్ల 16 లక్షల మందికి, మేకిన్ ఇండియా కార్యక్రమం ద్వారా 60 లక్షల మందికి ఉద్యోగాలు
# వచ్చే 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌కు రూపకల్పన
Also Read: Samantha - Karthi: ఫుల్ జోష్‌లో సమంత.. తమిళ స్టార్ హీరోకి ఒకే చెప్పేసింది!!
Also Read: IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. టీమిండియా అభిమానులకు శుభవార్త చెప్పిన బెంగాల్ ప్రభుత్వం!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook