Hero Xoom New Model 2024: ప్రముఖ హీరో మోటర్ సైకల్ కంపెనీ త్వరలోనే గుడ్ న్యూస్ తెలపబోతోంది. మార్కెట్‌లో మంచి ప్రజాదరణ లభించి అన్ని బైక్, స్కూటర్స్‌ను అప్‌డేట్ వేరియంట్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే మావెరిక్ 440తో పాటు జూమ్ స్కూటర్స్‌ను ఫైలట్ ప్రాజెక్ట్ కింద అప్‌డేట్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. హీరో కంపెనీ జూమ్ స్కూటర్ జనవరి 2023 సంవత్సరంలో మార్కెట్‌లోకి లాంచ్ చేయగా దీనిని మరో సారీ కొత్త రంగుల్లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా పండగ సీజన్‌లో దీనిని లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్కూటర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
3 వేరియంట్స్‌లో స్కూటర్:
హీరో జూమ్ స్కూటర్ మొత్తం మూడు వేరియంట్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఇది LX, VXతో పాటు ZX వేరియంట్స్‌లో అందుబాటులోకి రానుంది. అయితే ఈ స్కూటర్స్‌కి కంపెనీ కొత్త పేరు పెట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కొత్త ఫీచర్స్‌తో ఈ బైక్ అందుబాటులోకి రానుంది. ఈ స్కూటర్ అనేక శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. ఈ మూడు వేరియంట్స్ కీ-లెస్ ఇగ్నిషన్ సెటప్‌తో అందుబాటులోకి రానుంది. అలాగే ఈ స్కూటర్ రిమోట్ సీట్ ఓపెనింగ్‌తో పాటు i3s స్టాప్-స్టార్ట్ టెక్నాలజీతో అందుబాటులోకి రాబోతోంది.
అంతేకాకుండా ఈ కొత్త జూమ్ స్కూటర్ పూర్తి LED లైటింగ్‌తో కూడిన డిజిటల్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా డాష్ బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్స్, SMS హెచ్చరికల సెటప్‌ను కూడా అందిస్తోంది. ఈ బైక్ 110.9cc ఇంజన్ కెపాసిటీతో అందుబాటలోకి వచ్చింది. దీంతో పాటు ఇది 8.05bhp శక్తితో పాటు 8.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే
ఈ జూమ్ స్కూటర్ అద్భుతమైన డిస్క్ బ్రేక్ సిస్టమ్‌తో అందుబాటులోకి రాబోతోంది . దీంతో పాటు ఎన్నో రకాల అద్భుతమైన మరెన్నో కొత్త ఫీచర్స్‌తో ఈ స్కూటర్ అందుబాటులోకి రాబోతోంది. ఇక ఈ బైక్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే, దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ.71,484 నుంచి రూ.79,967 వరకు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అప్‌డేట్ చేసిన స్కూటీకి రూ. 5 వేల వరకు ధర పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తే వివిధ రకాల బ్రాండ్‌లకు సంబంధించిన స్కూటీలతో పోటీ పడబోతోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి