Petrol, Diesel Prices Today Hyderabad June 16, 2021: ఇండియాలో నిన్న స్థిరంగా ఉన్న ఇంధన ధరలు బుధవారం నాడు మరోసారి పెరిగాయి. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న సమయంలోనూ ఈ ఏడాది పలుమార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారుల జేబులు గుల్ల అవుతున్నాయి. ఓవైపు నిత్యావసర సరుకుల ధరలు మండిపోతుంటే మరోవైపు ఇంధన ధరలు
తాజాగా పెట్రోల్‌పై 25 పైసలు పెరగగా, డీజిల్ ధర 13 పైసల మేర పెరిగింది. దీంతో ఢిల్లీలో ఆల్ టైమ్ గరిష్టానికి పెట్రో ధరలు చేరుకున్నాయి. ఢిల్లీలో పెట్రోల్ 1 లీటర్ ధర రూ.96.66, డీజిల్ ధర రూ.87.28 అయింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ 1 లీటర్ ధర రూ.102.82 కాగా, డీజిల్ ధర రూ.94.84కు చేరింది. చెన్నైలో పెట్రోల్ 97.91, డీజిల్ ధర రూ.92.04 అయింది.
Also Read: EPFO Alert: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, జాబ్ కోల్పోయినా COVID-19 అడ్వాన్స్ నగదు సాయం
తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు మరింత భారమయ్యాయి. హైదరాబాద్‌లో బుధవారం 26 పైసలు పెరగడంతో 1 లీటర్ పెట్రోల్ ధర రూ.100.46కు చేరుకుంది. నగరంలో ఇది ఆల్ టైమ్ గరిష్ట ధర. 14 పెరగడంతో 1 లీటర్ డీజిల్ ధర రూ.95.28 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఏపీలోని విజయవాడలో 42 పెరగడంతో జూన్ 16న 1 లీటర్ పెట్రోల్ ధర రూ.102.98కి చేరింది. 32 పైసల మేర పెరగడంతో 1 డీజిల్ ధర రూ.97.19 అయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook