Bodyguard salaries: షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ బాడీగార్డుల జీతం కోట్లలో ఉంటుందా? ఇది నిజమేనా?

Bodyguard salaries: బాలీవుడ్ స్టార్ హీరోలు  సల్మాన్ ఖాన్, సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ జీతం గురించి తరచుగా వార్తలు వస్తుంటాయి. వారి జీతాలు ఏడాదికి కోట్లలో ఉంటాయని చెబుతుంటారు. నిజంగానే స్టార్ హీరోల బాడీగార్డ్స్  జీతం కోట్లలోనే ఉంటుందా?  ప్రముఖ సెక్యూరిటీ కన్సల్టెంట్ యూసఫ్ ఇబ్రహీం ఏం చెప్పారో తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Jan 11, 2025, 05:34 PM IST
Bodyguard salaries: షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ బాడీగార్డుల జీతం కోట్లలో ఉంటుందా? ఇది నిజమేనా?

Bodyguard salaries: బాలీవుడ్ తారలు తమ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు. ఎక్కడికి వెళ్లిన పక్కన బాడీగార్డ్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. బాలీవుడ్ స్టార్ హీరోలు అయిన  సల్మాన్ ఖాన్ నుండి షారుఖ్ ఖాన్ వరకు ప్రతి ఒక్కరికీ వారి వ్యక్తిగత బాడీగార్డ్ ఉంటారు. అయితే సల్మాన్ బాడీగార్డ్ షేరా, షారుక్ బాడీగార్డ్ రవి సింగ్ గురించి ఎక్కువగా వార్తలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా వారి జీతభత్యాల గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తుంటాయి. వారు కోట్లలో జీతాలు తీసుకుంటారని చెబుతుంటారు. అయితే ఇటీవలి పోడ్‌కాస్ట్‌లో, యూసుఫ్ ఇబ్రహీం ఈ ఇద్దరి సంపాదన గురించి చాలా విషయాలు వెల్లడించారు.

రవి సింగ్ ఆదాయం: 

యూసుఫ్ ఇబ్రహీం ప్రముఖ సెక్యూరిటీ కన్సల్టెంట్.. అలియా భట్, వరుణ్ ధావన్‌తో సహా చాలా మంది A-గ్రేడ్ సెలబ్రిటీలకు వారి కెరీర్ ప్రారంభ రోజుల నుండి అతను భద్రత కల్పిస్తున్నాడు. ఇటీవల ఒక పోడ్‌కాస్ట్‌లో ప్రముఖ టీవీ హోస్ట్ సిద్ధార్థ్ కన్నన్, షారుఖ్ బాడీగార్డ్ రవి సింగ్ వార్షిక వేతనం రూ. 2.7 కోట్లు తీసుకుంటారా అని యూసఫ్ ఇబ్రహీంను అడిగాడు. ఇబ్రహీం స్పందిస్తూ అది అబద్దమని చెప్పారు. అంటే యూసఫ్ ఇబ్రహీం ప్రకారం రవి సింగ్ జీతంపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు.

Also Read: Business Ideas: ఎకరం పొలంలో ఈ పంట సాగు చేస్తే.. తక్కువ సమయంలో 3 లక్షలు మీ సొంతం  

షేరా ఆదాయం: 

సల్మాన్ బాడీగార్డ్ షేరా సంపాదన ఏటా రూ. 2 కోట్లు  నిజమేనా అని అడిగిన ప్రశ్నకు.. యూసఫ్ వేరే సమాధానం చెప్పాడు. షేరాకు సొంత సెక్యూరిటీ ఏజెన్సీ కూడా ఉందని ఆయన చెప్పారు. అంతేకాదు అతనికి చాలా వ్యాపారాలు కూడా ఉన్నాయని..ఆయనకు ఆస్తిపాస్తులు చాలా ఉన్నట్లు చెప్పారు. షేరా అసలు పేరు గుర్మీత్ సింగ్ జాలీ. అతను దాదాపు రెండు దశాబ్దాలుగా సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ గా ఉంటున్నారు. టైగర్ సెక్యూరిటీ పేరుతో షేరా తన ఏజెన్సీని నడుపుతున్నాడు.

శ్రేయ్‌సే తేలే ఆదాయం:

అక్షయ్ కుమార్ బాడీగార్డ్ శ్రేయ్ తేలే ఏడాదికి రూ.1.2 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై యూసుఫ్ ఇబ్రహీం మాట్లాడుతూ.. అతని వ్యక్తిగత సమాచారం నా దగ్గర లేదు. నెలవారీగా చూస్తే రూ.10 నుంచి 12 లక్షలు ఉండదన్నారు. 

Also Read: Amrit Bharat 2.0: రెండేళ్లలో 50 అమృత్ భారత్ రైళ్ల తయారీ ..కొత్త 12 రకాల మార్పులు: అశ్వనీ వైష్ణవ్ 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News