SBI Customers Alert: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) కరోనా వైరస్, లాక్డౌన్ సమయంలోనూ పలు సేవలు అందించింది. బ్యాంకులకు రాకుండానే ఇంటి వద్ద నుంచే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సేవలు అందుబాటులోకి తెచ్చి తమ కస్టమర్లకు కరోనా భయం లేకుండా చేసింది.
భారతీయ స్టేట్ బ్యాంక్ తమ ఖాతాదారులకు ఓ అలర్ట్ జారీ చేసింది. బ్యాంకులు పనివేళలు ముగిసినా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో బ్యాంకింగ్ లాంటి సేవల్ని అందిస్తున్న ఎస్బీఐ కొన్ని గంటలపాటు సేవలకు అంతరాయం కలుగుతుందని తెలిపింది. జూన్ 16వ తేదీన అర్ధరాత్రి 12:30 గంటల నుంచి అర్ధరాత్రి 2:30 గంటలవరకు రెండు గంటలపాటు ఎస్బీఐ ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండవని (SBI Alert to Customers) ఓ ప్రకటనలో తెలిపింది. వెబ్సైట్ అప్డేట్, సైట్ మెయింటనెన్స్ కారణాలతో అర్ధరాత్రి 2 గంటలపాటు తమ సేవలకు అంతరాయం కలిగిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read: Gold Price In Hyderabad 16th June 2021: హైదరాబాద్‌లో దిగొచ్చిన బంగారం ధర, లేటెస్ట్ రేట్లు ఇలా
We request our esteemed customers to bear with us as we strive to provide a better banking experience.#InternetBanking #YONOSBI #YONO #ImportantNotice pic.twitter.com/hxN9ptHQy5
— State Bank of India (@TheOfficialSBI) June 15, 2021
ఖాతాదారులకు ఇబ్బంది కలగకూడదన్న నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో ఎస్బీఐ వెబ్సైట్ మెయింటనెన్స్ పనులు చేపట్టినట్లు వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టత ఇచ్చింది. నేటి అర్ధరాత్రి 12:30 గంటల నుంచి అర్ధరాత్రి 2:30 గంటలవరకు State Bank Of India ఇంటర్నెట్ బ్యాంకింగ్ యోనో యోనో లైట్ యూపీఐ సేవలు అందుబాటులో ఉండవని, అందుకు తాము చింతిస్తున్నామని తెలుపుతూ తన ఖాతాదారులను ఎస్బీఐ అప్రమత్తం చేసింది.
Also Read: Petrol, Diesel Prices Today: హైదరాబాద్‌లో ఆల్‌టైమ్ గరిష్టానికి పెట్రోల్, డీజిల్ ధరలు
మరోవైపు దేశవ్యాప్తంగా 25శాతం వరకు ఎస్బీఐ సేవలు అందిస్తుంది. ఇండియాలో 44 కోట్ల మంది ఖాతాదారులుండగా, 22000 బ్యాంక్ బ్రాంచులు, 58,500 ఏటీఎంలు, 66,000 బీసీ ఔట్‌లెట్స్‌తో భారతీయ స్టేట్ బ్యాంకు తన సేవలను విస్తరించింది. వీటితో పాటు ఎస్బీఐ జనరల్ ఇన్సురెన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ కార్డ్ లాంటి పలు సేవల్ని అందుబాటులోకి తెచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook