Best Mutual Fund: మనం ఎంత సంపాదించినా.. నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఇప్పటి నుంచి డబ్బులు పొదుపు చేసుకుంటే.. భవిష్యత్‌లో అవసరాలకు ఉపయోగపడతాయి. అందుకే ప్రస్తుతం చాలా మంది తమకు వచ్చే జీతంలో ఎంతోకొంత పెట్టుపెడి పెడుతున్నారు. మీరు కూడా పెట్టుబడిని ప్రారంభించాలని అనుకుంటున్నట్లయితే.. మీకో గుడ్‌న్యూస్. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ ద్వారా ఈక్విటీ విభాగంలో కొత్త ఇండెక్స్ ఫండ్ (ఎన్‌ఎఫ్‌ఓ) తీసుకువచ్చింది. ఫండ్ హౌస్ కొత్త ఫండ్ ఎస్‌బీఐ, ఎస్ అండ పీ, బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్‌కు సబ్‌స్క్రిప్షన్ మే 18 నుంచి ఓపెన్ చేసింది. ఇందుకోసం మీరు ఈ నెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్ ఎండ్ స్కీమ్ అయినందున మీకు ఎప్పుడు కావాలంటే అక్కడ రీడీమ్ చేసుకోవచ్చు.
మీరు కేవలం రూ.5 వేలతో ఎస్‌బీఐ, ఎస్ అండ పీ, బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆ తరువాత మీరు రూ.1 గుణిజాలలో మీరు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు రోజువారీ ఎస్‌పీ చేస్తే.. రూ.500, అప్పుడు మీరు రూ.1 గుణిజాలలో డబ్బును ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రతి నెలా రూ.1000, త్రైమాసికానికి రూ.1500, ఆ తర్వాత రూ.1 గుణిజాలలో పెట్టుబడి పెట్టేందుకు ఆప్షన్ ఉంటుంది. మీరు 15 రోజుల్లో ఈ పథకం నుంచి రీడీమ్ చేసుకుంటే.. మీరు 0.2 శాతం ఎగ్జిట్ లోడ్ మాత్రమే చెల్లించాలి.
దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఈ పథకం పెట్టాలనుకునే వారికి ఈ స్కీమ్ బెటర్‌గా ఉంటుంది. దీర్ఘకాలికంగా ఎస్ అండ పీ, బీఎస్‌ఈ సెన్సెక్స్ టీఆర్ఐ పనితీరుకు అనుగుణంగా రాబడిని కోరుకునే పెట్టుబడిదారులకు ఇది మంచి ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో వచ్చే డబ్బును సెన్సెక్స్‌లో చేర్చిన కంపెనీల్లో సమానంగా ఇన్వెస్ట్ చేస్తారు.
Also Read: Amazon Shopping: అమెజాన్ వినియోగదారులకు షాక్.. ఈ వస్తువులపై ధరల పెంపు..?
Also Read: Cabinet Meeting: కొత్త సచివాలయంలో తొలిసారి కేబినెట్ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి