Railway General Ticket: రైల్వే టికెట్ కోసం ఇప్పుడు క్యూ అవసరం లేదు. గంటల నిరీక్షణ లేదా టెన్షన్ ఉండదు. ఇంట్లోనే జనరల్ టికెట్ తీసుకుని వెళ్లవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
రైల్వే ప్రయాణీకులకు ఇది శుభవార్త. రిజర్వేషన్ కాకుండా అప్పటికప్పుడు టికెట్ కొనుగోలు చేసుకునేవారికి మంచి వెసులుబాటు ఇది. దక్షిణ మధ్య రైల్వేశాఖ కొత్తగా ప్రవేశపెట్టిన యూటీఎస్ యాప్‌కు అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ఈ యాప్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే..ప్రయాణానికి 5 నిమిషాల ముందు కూడా ఇంట్లో ఉండి లేదా స్టేషన్‌కు వెళ్లేదారిలోనే టికెట్ తీసేయవచ్చు. లేదా రైలెక్కే ముందు కూడా టికెట్ తీసుకోవచ్చు.
స్టేషన్ వచ్చేసరికే ట్రైన్ కదిలిపోతుంటే..టికెట్ కోసం ఆగాల్సిన అవసరం లేదు. రైలెక్కి యాప్‌లో టికెట్ తీసుకోవచ్చు. రిజర్వేషన్ కాకుండా జనరల్ టికెట్‌ను సైతం ఆన్లైన్లో తీసుకోగలిగే యాప్ ఇది. అన్ని ప్రధాన రైళ్లు, ప్యాసెంజర్ రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లలో సాధారణ టికెట్ కోసం యూటీఎస్ అంటే అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ యాప్‌కు అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకూ 7.5 లక్షలమంది ప్రయాణీకులు యూటీఎస్ విధానంలో ఆన్లైన్లో సాధారణ టికెట్ కొనుగోలు చేశారు.
సాధారణ టికెట్ ఇకపై చాలా సులభం
మొబైల్ ఫోన్లో ముందుగా యూటీఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. లాగిన్ వివరాలు సమర్పించిన తరువాత ఇందులో ఉండే వాలెట్లో డబ్బులు కొద్దిగా ఉంచుకోవాలి. లేదా యూపీఐ విధానంలో నేరుగా లావాదేవీలు జరపవచ్చు. ఇంట్లోంచి రైల్వే స్టేషన్‌కు బయలుదేరే సమయంలోనే టికెట్ తీసుకోవచ్చు. యూటీఎస్ టికెటింగ్‌పై దక్షిణ మధ్య రైల్వే రాయితీ కూడా అందిస్తోంది. ప్లాట్‌ఫామ్ టికెట్ కూడా తీసుకోవచ్చు.
Also read: PPF Rules Updates: పీపీఎఫ్ వడ్డీ రేట్లలో కొత్త నిబంధనలు, పెరగనున్న వడ్డీరేటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook