New Sim Card Rules: అక్టోబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డు నిబంధనలు, ఇకపై నో స్పామ్ కాల్స్

New Sim Card Rules: అక్టోబర్ 1 సమీపిస్తోంది. మరో రెండ్రోజులే మిగిలుంది. రిలయన్స్ జియో అయినా, ఎయిర్‌టెల్ అయినా, వోడాఫోన్ ఐడియా లేదా బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ ఏదైనా సరే సిమ్ కార్డు నిబంధనలు మారిపోతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 28, 2024, 08:56 PM IST
New Sim Card Rules: అక్టోబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డు నిబంధనలు, ఇకపై నో స్పామ్ కాల్స్

New Sim Card Rules: టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధన ప్రకారం టెలీకం కంపెనీలు ఏయే ప్రాంతాల్లో తమ నెట్‌వర్క్ అందుబాటులో ఉందో వివరాలు అందించాల్సి ఉంటుంది. అదే సమయంలో స్పామ్ కాల్స్ అరికట్టేందుకు కొత్త చర్యలు తీసుకోవాలి. 

వినియోగదారుల సౌలభ్యం, సౌకర్యం దృష్టిలో ఉంచుకుని ట్రాయ్ ఎప్పటికప్పుడు సిమ్ కార్డు నిబంధనలు మారుస్తుంటుంది. ఇందులో భాగంగా ట్రాయ్ మరో నిబంధన ప్రవేశపెట్టింది. ఈ నిబంధన అమల్లోకి వస్తే యూజర్లకు ఏ ప్రాంతంలో ఏ నెట్‌వర్క్ ఉందో సులభంగా తెలుస్తుంది. తగిన వివరాలు అందించాల్సిందిగా ట్రాయ్ ఇప్పటికే వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌‌టెల్, రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్ సంస్థల్ని కోరింది. ఎందుకంటే ఒకే సంస్థ వేర్వేరు నెట్‌వర్క్స్ అందిస్తోంది. 5 జి నెట్‌వర్క్ ఒక ప్రాంతంలో ఉండి మరో ప్రాంతంలో ఉండకపోవచ్చు. మరో ప్రాంతంలో వేరే సంస్థ నెట్‌వర్క్ ఉండి ఉండవచ్చు. సంస్థ ఒకటే అయినా ప్రాంతాన్ని బట్టి 5జి లేదా 4జీ అందుబాటులో ఉంటుంది. ఈ సందిగ్దత తొలగించే ప్రయత్నమే ట్రాయ్ చేసిన కొత్త నిబంధన.

ఇకపై టెలీకం కంపెనీలు నెట్‌వర్క్ సంబంధిత సమాచారాన్ని పూర్తిగా తమ వెబ్‌సైట్స్‌లో ప్రస్తావించాలి. దాంతో యూజర్లు సులభంగా తెలుసుకోగలుగుతారు. మీ ప్రాంతంలో ఎయిర్‌టెల్ 5జి ఉందో లేదో తెలుసుకోవాలంటే నేరుగా ఆ కంపెనీ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీ లొకేషన్ ఎంటర్ చేస్తే చాలు తెలిసిపోతుంది. నెట్‌వర్క్ గురించి సమాచారం ఇలా తెలుసుకోవచ్చు. ఇక ప్రస్తుతం అన్ని నెట్‌వర్క్ యూజర్లు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య స్పామ్ కాల్స్. వీటిని అరికట్టేందుకు టెలీకం కంపెనీ కఠినమైన చర్యలు తీసుకోవాలని ట్రాయ్ సూచించింది. 

Also read: PF Account transfer: మీ పీఎఫ్ ఎక్కౌంట్ ఆన్‌లైన్‌లో బదిలీ చేయడం ఎలా

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News