WhatsApp End-to-End Encrypted Cloud Backups : వాట్సాప్ గురించి ఈ మధ్య చాలా అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. యూజర్ భద్రత (user security) గురించే ఎక్కువగా చర్చ సాగుతోంది. ఈమధ్య కాలంలో ఫేస్‌బుక్ వాట్సాప్ యూజర్ల డాటాను చోరీ చేస్తోందనే ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకండి.. మీ డాటా భద్రతకు ఎలాంటి ముప్పు ఇంకా ఎక్కువగా మీ డాటాకు సెక్యూరిటీ ఇస్తామంటోంది వాట్సాప్.
ప్రస్తుతం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ (end-to-end encryption) ద్వారా యూజర్ చాట్ డాటాకు భద్రత (Data secure)కల్పిస్తోంది వాట్సాప్. ఈ తరుణంలో మరో ప్రైవసీ అప్‌డేట్‌ను మన ముందు ఉంచింది. వాట్సాప్ చాట్ బ్యాకప్‌ల విషయంలోనూ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వర్తిస్తుందంటూ గుడ్ న్యూస్ చెప్పింది వాట్సాప్.
Also Read : China Mosquitoes Mission: మొన్న కరోనా.. ఇపుడు "మిషన్ మస్కిటో".. చైనా మరొక ప్రయోగం
బ్యాకప్‌నకు మరింత భద్రత
ఈ విధానం ద్వారా . వాట్సాప్ చాట్ బ్యాకప్‌నకు మరింత భద్రత ఉండనుంది. ఇక నుంచి వాట్సాప్ హిస్టరీని బ్యాక్ అప్ చేసినప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కోరుతుంది. అది కేవలం వాళ్లకు మాత్రమే కనిపిస్తుంది. సంబంధిత డ్రైవ్‌లోని సమాచారాన్ని ఎవరూ అన్‌లాక్ చేయలేరు. సంబంధిత డ్రైవ్‌ల్లో అంటే ఐక్లౌడ్స్ లేదా గూగుల్ డ్రైవ్‌లలో (Google drive) ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సాయంతో యాక్సెస్‌కు అనుమతి ఉంటుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఫీచర్ యూజర్‌కు అందుబాటులో రానుంది. కానీ ఇది డిఫాల్ట్‌గా ఆన్ కాదు. పాస్‌వర్డ్‌ని క్రియేట్ చేసుకోవడం గానీ, 64 డిజిట్ ఎన్క్రిప్షన్ కీ మీద యూజర్ ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ పాస్‌వర్డ్ మర్చిపోతే.. అకౌంట్ రికవరీకి వాట్సాప్ (WhatsApp) ఎలాంటి సాయం అందించలేదు. సో ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.
Also Read : Sai Dharam Tej Accident CCTV Footage: వైరలైన సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ CCTV ఫుటేజ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook