Zoom President Greg Tomb Fired: ప్రపంచ వ్యాప్తంగా వరుస లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. ప్రైవేట్ రంగంలో ఎవరి ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. గత నెలలో వీడియో కమ్యూనికేషన్ రంగ దిగ్గజం జూమ్ కూడా 1300 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. తాజాగా కంపెనీ ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను ఆకస్మికంగా తొలగించింది. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. అయితే ఆయన తొలగింపునకు ఎటువంటి కారణాలను వెల్లడించలేదు.
జూమ్ తన ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్స్‌ను ఏ కారణం లేకుండా తొలగించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ప్రకటించింది. గ్రెగ్ టోంబ్‌ను గతేడాది జూన్‌లోనే నియమించింది. ఆయన పదవీ కాలం ఏడాది పూర్తి చేసుకోకముందే పదవి నుంచి తొలగించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టోంబ్స్ స్థానంలో కంపెనీ కొత్త అధ్యక్షుడిని ఇంకా నియమించలేదని జూమ్ ప్రతినిధి వెల్లడించారు.
ఆగస్ట్ 2019లో కంపెనీ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్‌గా టోంబ్స్ జూమ్‌లో చేరారు. ఆయన 8 నెలల క్రితమే టాప్ పోస్ట్‌కు ప్రమోట్ అయ్యారు. జూమ్‌లో చేరడానికి ముందు.. టోంబ్స్ మే 2021 నుంచి గూగుల్‌లో సేల్స్, గూగుల్ వర్క్‌స్పేస్, సెక్యూరిటీ వైస్ ప్రెసిడెంట్, జియో ఎంటర్‌ప్రైజ్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు.
గత నెలలో తమ కంపెనీ ఉద్యోగులలో 15 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు జూమ్ సీఈఓ ఎరిక్ యువాన్ ప్రకటించారు. దీంతో కంపెనీకి చెందిన దాదాపు 1300 మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. అంతేకాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరంలో తన జీతం 98 శాతం తగ్గించుకుంటానని.. ఈసారి తన వార్షిక కార్పొరేట్ బోనస్‌ను కూడా తీసుకోనని యువాన్ ప్రకటించారు.
గత కొన్ని నెలలుగా మాంద్యం ఎదుర్కొనేందుకు అనేక టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇంతకుముందు డెల్ తన ఉద్యోగులలో 6,650 మందిని తొలగించింది. గూగుల్ కంపెనీ జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా, మైక్రోసాఫ్ట్ కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్ స్టార్టప్ కంపెనీలలో కూడా తొలగింపులు జరుగుతున్నాయి. దీంతో ప్రైవేట్ రంగంలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. ఓపీఎస్‌పై కీలక ఉత్తర్వులు
Also Read: Bandi Sanjay: పీఆర్‌సీ ఏర్పాటు చేయండి.. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి