Kolkata Doctor Rape Murder Case: కోల్‎కతా ట్రైనీ డాక్టర్ ఘటనలో కొత్త కోణం...జైలు గార్డుతో సంచలన విషయాలు బయటపెట్టిన నిందితుడు

Trainee doctor murder case: కోల్ కతా ట్రైనీ వైద్యురాలి కేసు  రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా నిందితుడు సంజయ్ రాయ్ సంచలన విషయాలను బయటపెట్టాడు. జైలు గార్డుతో నిందితుడు ఈ దారుణ హత్యకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. జైలు గార్డుతో నిందితుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Aug 25, 2024, 12:10 PM IST
 Kolkata Doctor Rape Murder Case: కోల్‎కతా ట్రైనీ డాక్టర్ ఘటనలో కొత్త కోణం...జైలు గార్డుతో సంచలన విషయాలు బయటపెట్టిన నిందితుడు

Kolkata doctor murder case accused sanjoy roy told a sensational story to the jail guard: కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్య కేసులో రోజుకో విషయం బయటకు వస్తుంది. ఈ ఘటనపై ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు ఆదివారం పూర్తి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే లై డిటెక్టర్ పరీక్షకు ముందు, నిందితుడు దారుణ హత్యకు సంబంధించిన తనను కావాలనే ఇరికించారని..తాను నిర్దోషిని అని తనను బలిపశువును చేశారంటూ చెప్పాడు. సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ పరీక్ష ముందుగా శనివారం (ఆగస్టు 24) జరగాల్సి ఉందని, అయితే కొన్ని సాంకేతిక కారణాలు,  జైలు పరిపాలనలో కొన్ని ఏర్పాట్ల కారణంగా, పాలిగ్రాఫ్ పరీక్ష శనివారం చేయలేకపోయామని అధికారులు తెలిపారు. నేడు మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, మరో నలుగురు వైద్యులు సహా ఆరుగురికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు.

జైలు భద్రతా సిబ్బందికి నిందితుడు ఏం చెప్పడంటే? 

ఈ అత్యాచారం, హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని జైలు భద్రతా సిబ్బందికి నిందితుడు చెప్పినట్లు జైలు అధికారులను ఉటంకిస్తూ ఓ నివేదిక పేర్కొంది. శుక్రవారం కూడా నిందితుడు ఇలాంటి వాదనలే చేసినట్లు అధికారులు తెలిపారు. సీల్దాలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు తనకు ఏ పాపం తెలియదని చెప్పాడు.  తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకే విచారణకు అంగీకరించినట్లు న్యాయమూర్తికి తెలిపారు.ఈకేసు తనకు ఎలాంటి సంబంధంల లేదని మెజిస్ట్రేట్ ముందు నిందితుడు చెప్పినట్లు అధికారులు తెలిపాయి. అందకుముందు తమ  విచారణలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య చేసినట్లు సంజయ్ రాయ్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. 

సంజయ్ రాయ్ ప్రకటనల్లో వ్యత్యాసాలు : 

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, పోలీసులు అతని వాంగ్మూలాల్లో స్పష్టమైన వ్యత్యాసాలను గుర్తించారు. సంజయ్ రాయ్ పరిశోధకులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ అధికారి హిందుస్థాన్ టైమ్స్‌కు తెలిపారు. విచారణాధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని అధికారి అన్నారు. అతని ముఖం, శరీరంలోని ఇతర భాగాలపై తాజా గాయాలు, నేరం జరగడానికి నిమిషాల ముందు 4.03 గంటలకు నేరస్థలానికి దారితీసే కారిడార్‌లో అతను తిరుగుతున్నట్లు  CCTV ఫుటేజీకి సంబంధించి వివరాల గురించి స్పష్టమైన సమాధానం చెప్పలేదని తెలిపారు. 

కట్టుదిట్టమైన భద్రత మధ్య నిందితుడు: 

సంజయ్ రాయ్‌ను కట్టుదిట్టమైన భద్రతతో జైలులోని సెల్ నంబర్ 21లో ఉంచారు. నిఘా కోసం నిందితుడి సెల్ బయట సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిందితుడు అశ్లీలతకు బానిసైయ్యాడని..జంతువుల వలే ప్రవర్తనను కలిగి ఉన్నాడని ఓ వైద్యుడు చెప్పినట్లు సిబిఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ నేరం చేసినందుకు నిందితుడు ఎలాంటి పశ్చాత్తాపం చూపడం లేదన్నారు. దర్యాప్తు సంస్థ ముందు తానే ఈ నేరం చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. 

ఆగస్టు 8-9 రాత్రి ఏం జరిగింది?

ఆగస్టు 8-9 రాత్రి కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ హాల్‌లో మహిళా డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేశారు. మరుసటి రోజు ఉదయం సెమినార్ హాల్‌లో ట్రైనీ డాక్టర్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్నిగుర్తించేందుకు  కొన్ని గంటల ముందు, ఆమె తన 36 గంటల షిఫ్ట్ తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి హాల్‌కు వెళ్లింది. ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున 4.03 గంటలకు సంజయ్ రాయ్ సెమినార్ హాల్లోకి ప్రవేశించినట్లు సీసీటీవీ ఫుటేజీల విశ్లేషణలో వెల్లడైంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News