Numaish Video: కొంప ముంచిన నుమాయిష్.. అరగంట పాటు గాల్లోనే సందర్శకులు.. వీడియో ఇదే..

 Hyderabad: ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా నాంపల్లి ఎక్జిబిషన్ గ్రాండ్ గా ప్రారంభమైంది. అయితే.. దీనిలో ఈరోజు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.   

Written by - Inamdar Paresh | Last Updated : Jan 16, 2025, 10:48 PM IST
  • నుమాయిష్ లో అనుకొని ఘటన..
  • భయాందోళనకు గురైన సందర్శకులు..
Numaish Video: కొంప ముంచిన నుమాయిష్..  అరగంట పాటు గాల్లోనే సందర్శకులు.. వీడియో ఇదే..

Nampally numaish in Hyderabad: హైదరాబాద్ లోని నాంపల్లిలో ప్రతి ఏడాది నుమాయిష్ ఎంతో గ్రాండ్ గా జరుగుతుంది. దీనిలో అనేక ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. అంతే కాకుండా.. డ్రెస్ స్టాల్స్...కొన్ని వందల రకాల ఫుడ్, అన్నిరకాల స్టఫ్ లు ఇక్కడ లభిస్తాయి. దీన్ని చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు భారీగా తరలి వస్తుంటారు. అయితే.. నుమాయిష్ లో జాయింట్ వీల్స్, అమ్యూజ్ మెంట్ వీల్స్ కూడా ఉంటాయి.

చిన్న పిల్లలకు, పెద్దలకు ప్రత్యేకంగా జాయింట్ వీల్స్ ఉంటాయి. ఈ క్రమంలో ఈరోను నుమాయిష్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అమ్యూజ్ మెంట్ రైడ్ లో ఎక్కిన వాళ్లకు గుండె ఆగినంత పనైంది. ఈ రైడ్  కాసేపు బాగానే పనిచేసిన ఆ తర్వాత ఒక్కసారిగా ఆగిపొయింది.

 

దీంతో దానిలో ఎక్కిన సందర్శకులు షాకింగ్ కు గురయ్యారు. దాదాపు.. అరగంట పాటు.. ఈ అమ్యూజ్ మెంట్ గాల్లో అలానే నిలిచిపోయింది. దీంతో సందర్శకులు మాత్రం.. తమ పనైపోయిందిరా బాబోయ్ అని కొంత మంది అనుకున్నారంట. అయితే.. బ్యాటరీలో ఏర్పడిన లోపం కారణంగా అరగంట పాటు అమ్యూజ్ మెంట్ నిలిచిపోయిందని నిర్వహకులు వెల్లడించారు.

దీనిపై సందర్శకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ బాలేనివాళ్లు ఉంటారు. చిన్న పిల్లలు ఉన్నారు. ఏదైన సైరన్ లాంటివి ఉండాలి కదా అని తిట్టిపోశారంట. ముఖ్యంగా ఇలాంటి ప్రదేశంలో ఉన్నప్పుడు.. ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొవాలని కూడా తమ ఆగ్రహాం వ్యక్తం చేశారు.

Read more: Viral Video: వీడియో ఇదే.. ఆటో డ్రైవర్‌పై యువతి అఘాయిత్యం.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

కానీ అరగంట పాటు.. కష్టపడి.. తిరిగి ఆ రైడ్ ను అక్కడి వాళ్లు స్టార్ట్ చేశారు. దీంతో ఆ రైడ్ నుంచి సందర్శకులు దిగేసి.. హమ్మయ్య బతికిపోయామని ఊపిరి పీల్చుకుంటున్నారంట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

Trending News