Wedding Tragedy: పెళ్లిలో హడావుడి అంతా స్నేహితులదే ఉంటది. విందయినా.. చిందయినా స్నేహితులు దిగనంత వరకే.. ఒక్కసారి వాళ్లు దిగాక వేడుకకు సరికొత్త ఉత్సాహం వస్తుంది. అలా తన స్నేహితుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొని ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. స్నేహితుడి మరణంతో వరుడు కూడా కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ విషాద సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Also Read: Organ Donation: చనిపోతూ ముగ్గురికి పునర్జన్మ ప్రసాదించిన ఫుడ్ డెలివరీ బాయ్
కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లికి చెందిన విజయ్ కుమార్ (33) పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో జరిగిన స్నేహితుడి వివాహ విందుకు హాజరయ్యాడు. ఆదివారం సాయంత్రం గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో విజయ్ కుమార్ ఉత్సాహంగా పాల్గొన్నాడు. అక్కడ ఏర్పాటుచేసిన బరాత్‌లో డ్యాన్స్ చేశాడు. అనంతరం మరో చోట కూడా తెలిసినవారి వివాహ రిసెప్షన్ ఉంది. తోటి స్నేహితుడు రమ్మని పిలవడంతో విజయ్ కుమార్ అక్కడికి కూడా వెళ్లాడు. అక్కడ పెళ్లి ఊరేగింపులో విజయ్ పాల్గొని తన స్నేహితులతో కలిసి డ్యాన్స్‌లు చేశాడు.
Also Read: Revanth Reddy Flight: రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం.. విమానంలో తలెత్తిన సమస్య
ఇలా గంటల తరబడి డ్యాన్స్ చేస్తుండడంతో విజయ్ కుమార్ తీవ్రంగా అలసిపోయాడు. అయినా కూడా అలానే డ్యాన్స్ చేస్తూ విజయ్ కుమార్ ఒక్కసారిగా కుప్పకూలాడు. కిందపడిన అతడిని లేపేందుకు ప్రయత్నించగా విజయ్ కుమార్ లేవలేదు. ఆందోళన చెందిన తోటి స్నేహితులు, స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో విజయ్ కుమార్ చనిపోయాడని వైద్యులు తెలిపారు. దీంతో స్నేహితులంతా తీవ్ర విషాదంలో మునిగారు. సమాచారం తెలుసుకున్న పొత్కపల్లి ఎస్సై అశోక్ రెడ్డి వివరాలు తెలుసుకున్నారు. కాగా మృతుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనతో విజయ్ కుమార్ కుటుంబసభ్యులతోపాటు స్నేహితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్వగ్రామం తీగలగుట్టపల్లిలో విజయ్ కుమార్ అంత్యక్రియలు జరిగాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter