Abraham Ozler OTT: ప్రముఖ ఓటిటీలో మమ్ముట్టి లేటెస్ట్ మూవీ ‘అబ్రహం ఓజ్లర్’..షబీర్, మిర్నా మీనన్ 'బర్త్ మార్క్' మూవీస్..

Abraham Ozler: మల్లూవుడ్ నటుడు ముమ్ముట్టి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు ఏజ్ 70 యేళ్లు పై పడిన వరుస సినిమాలతో దుమ్ము దులుపుతున్నాడు. తాజాగా ఈయన ‘అబ్రహం ఓజ్లర్’ అనే సినిమాతో పలకరించాడు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దాంతో పాటు ‘బర్త్ మార్క్’ సినిమా కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 8, 2024, 11:17 AM IST
Abraham Ozler OTT: ప్రముఖ ఓటిటీలో మమ్ముట్టి లేటెస్ట్ మూవీ ‘అబ్రహం ఓజ్లర్’..షబీర్, మిర్నా మీనన్ 'బర్త్ మార్క్' మూవీస్..

Abraham Ozler: మలయాళం సూపర్ స్టార్ మమ్ముటి నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు ప్రేక్షకులను ఊపిరి బిగపట్టేలా ఎంగేజ్ చేస్తోంది. షాజీ పాడూర్  డైరెక్ట్ చేసారు. ఈ సినిమా మలయాళీ  బాక్సాఫీసు వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
మరోవైపు షబీర్, మిర్నా మీనన్ లీడ్ రోల్స్ నటించిన ‘బర్త్ మార్క్’ సినిమా కూడా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ థ్రిల్లర్ మూవీ విక్రమ్ శ్రీధరన్ డైరెక్ట్ చేసారు.  ఈ సినిమా ఫిబ్రవరిలో థియేటర్స్ లో రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆర్మీ లెఫ్టినెంట్ డేనియల్ గా షబీర్, అతని భార్య జెన్నిఫర్ గా మిర్నా మీనన్ తమ పెర్ఫార్మెన్స్ లతో ఆదరగొట్టారు. సీతారామం ఫేం విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.
 
ప్రస్తుతం ఈ రెండు సినిమాలు 'భవానీ మీడియా' ద్వారా ఆహాలో రిలీజ్ అయ్యాయి. గురువారం నుంచి 'బర్త్ మార్క్', శనివారం 10th "డెరిక్ అబ్రహం" ఆహాలో   స్ట్రీమ్ అవుతున్నాయి. 'డెరిక్ అబ్రహం' మూవీ మైండ్ బ్లోయింగ్ యాక్షన్ థ్రిల్లర్. కథ, స్క్రీన్ ప్లే, పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ కి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తాయి. ఇక థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన బర్త్ మార్క్ ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ థ్రిల్ ఎక్స్ పీరియన్స్ ని అందించనుంది.

ఈ రెండు ఎక్సయిటింగ్ మూవీస్ తో ఈ వీకెండ్ ఆహా లో ఎంటర్ టైన్ మెంట్ ఫుల్ ఆన్ గా ఉండబోతోంది. ముమ్ముట్టి విషయానికొస్తే.. ఈయన జాతీయ స్థాయిలో మూడు జాతీయ అవార్డులు అందుకున్నారు. అంతేకాదు తెలుగులో ఈయన పలు చిత్రాల్లో నటించారు. అప్పట్లో రైల్వే కూలి, స్వాతి కిరణం, యాత్ర, యాత్ర 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులను డైరెక్ట్ చేశారు. అంతేకాదు ఈయన కన్నడ, తమిళం, హిందీ సహా ప్యాన్ ఇండియా భాషల్లో అలరించారు. ముఖ్యంగా ఇమేజ్ కు సంబంధం లేకుండా డిఫరెంట్ చిత్రాలతో గత 50 యేళ్లుగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు.

ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News