Yada Krishna: టాలీవుడ్ నటుడు కన్నుమూత

ఒకప్పుడు తెలంగాణ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సినీ నటుడు, నిర్మాత యాదాకృష్ణ (61) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు.

Last Updated : Dec 3, 2020, 06:16 AM IST
  • కప్పుడు తెలంగాణ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సినీ నటుడు, నిర్మాత యాదాకృష్ణ (61) కన్నుమూశారు.
  • హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు.
  • జేఎన్‌టీయూలో ఉద్యోగిగా పనిచేస్తూ పదవీ విరమణ చేసిన యాదాకృష్ణకు మొదటినుంచి సినిమాలంటే ఆసక్తి.
Yada Krishna: టాలీవుడ్ నటుడు కన్నుమూత

Yada Krishna passes away: హైదరాబాద్: ఒకప్పుడు తెలంగాణ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సినీ నటుడు, నిర్మాత యాదాకృష్ణ (61) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. ఇటీవల యాదాకృష్ణ గుండె సమస్యలతో నిజాంపేట్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే గుండెపోటు రావడంతో ఆయన ఆసుపత్రిలోనే (Yada Krishna passes away) తుదిశ్వాస విడిచారు. జేఎన్‌టీయూలో ఉద్యోగిగా పనిచేస్తూ పదవీ విరమణ చేసిన యాదాకృష్ణకు మొదటినుంచి సినిమాలంటే ఆసక్తి.  Also read: Bandla Ganesh: నా దేవుడిని అంటే సహించను: బండ్ల గణేష్

దీంతో యాదాకృష్ణ (Yada Krishna ) పాతికేళ్ల క్రితమే టాలీవుడ్ ( Tollywood ) ప్రపంచంలోకి అడుగుపెట్టి హీరోగా, నిర్మాతగా పలు చిత్రాల్ని రూపొందించారు. ఒకపక్క ఉద్యోగం చేస్తూనే టీవీ సీరియల్స్‌లో,  సినిమాల్లో నటిస్తుండేవారు. శృంగార  కథాంశాలతో రూపొందిన గుప్తశాస్త్రం, వయసు కోరిక, పిక్నిక్‌ వంటి చిత్రాలతో యువతతోపాటు... ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇలా ఆయన సంక్రాంతి అల్లుడు, ఇరుకింట్లో ఇద్దరు పెళ్లాలు, గూఢచారి 786తో పాటు 20కిపైగా సినిమాల్లో నటించారు. యాదాకృష్ణకు భార్య రమాదేవి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ రోజు ఆయన అంత్యక్రియల్ని నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read | Pawan Kalyan: పిల్లల‌తో ప‌వ‌న్.. ఫొటోను షేర్ చేసిన రేణూ దేశాయ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News