Trikala Trailer: యాక్షన్ స్వీకెన్స్‌తో శ్రద్దా దాస్ 'త్రికాల'.. అదిరిపోయిన ట్రైలర్

Trikala Trailer Launch Event: త్రికాల మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఏప్రిల్‌లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుందని.. తప్పకుండా అదరించాలని చిత్రబృందం కోరుతోంది. ఈ మూవీ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Feb 15, 2025, 06:28 PM IST
Trikala Trailer: యాక్షన్ స్వీకెన్స్‌తో శ్రద్దా దాస్ 'త్రికాల'.. అదిరిపోయిన ట్రైలర్

Trikala Trailer Launch Event: 'యుద్దం రేపటి వెలుగు కోసం.. కానీ ఈ అంధకాసురిడి యుద్దం వెలుగుని నాశనం చేయడానికి..' అంటూ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో అలరించేందుకు రెడీ అవుతోంది త్రికాల మూవీ. శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి  తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు మణి తెల్లగూటి దర్శకత్వం వహిస్తున్నారు. రాధిక, శ్రీనివాస్ నిర్మాత సంయుక్తంగా నిర్మిస్తుండగా.. శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

తనికెళ్ల భరణి రాసిన డైలాగ్ 'యుద్దం రేపటి వెలుగు కోసం..' అంటూ ట్రైలర్‌ను మొదలుపెట్టారు. యాక్షన్ సీక్వెన్స్‌కు తోడు అదిరిపోయే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. ట్రైలర్ చివర్లో అజయ్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో అజయ్ మాట్లాడుతూ.. తాను ఇంత వరకు సినిమా చూడలేదని.. ఇక్కడే ట్రైలర్ చూస్తున్నానని అద్భుతంగా ఉందన్నారు. మంచి సినిమాను తీశామని.. క్వాలిటీ చాలా బాగుందన్నారు. అందరూ సపోర్ట్ చేయాలని కోరారు. అంబటి అర్జున్ మాట్లాడుతూ.. త్రికాల ట్రైలర్ చూసిన తరువాత ఈ సినిమా అంటే ఏంటో అందరికీ అర్థమవుతుందన్నారు. సినిమా అద్భుతంగా వచ్చిందన్నారు.

మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ.. ఈ మూవీ కోసం నిర్మాతలు చాలా కష్టపడ్డారని.. చాలా రీషూట్ జరిగినా ఎప్పుడు ప్రశ్నించలేదన్నారు. డైరెక్టర్ మణి అద్భుతంగా తీశారని మెచ్చుకున్నారు. అజయ్ నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. సమ్మర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. రవి వర్మ మాట్లాడుతూ.. ఈ మూవీ ట్రైలర్ చాలా బాగుందని.. తనది చిన్న పాత్రగా మొదలైనా సినిమా మొత్తం వాడేశారని అన్నారు. సినిమా అద్భుతంగా వచ్చిందని తెలిపారు. 

డైరెక్టర్ మణి మాట్లాడుతూ.. అజయ్ ఈ సినిమా స్టోరీ ముందు చెప్పానని.. VFX గురించి జాగ్రత్తగా చూసుకోవాలని సలహా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రయాణంలో ఆయన అండగా నిలబడ్డారని అన్నారు. త్రికాల సినిమాటిక్ యూనివర్స్ అని ట్రైలర్‌లో పెట్టామన్నారు. తనతోపాటు మహేంద్రన్ అన్ని రోజులు పనిచేశారని చెప్పారు. ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డామని.. చాలా వదులుకున్నామన్నారు. ప్రేక్షకులు సపోర్ట్ చేయాలని కోరారు.

నిర్మాత రాధిక మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని.. మన సూపర్ హీరోలను అందరికీ చూపించాలనే త్రికాల సినిమాను తీశామని తెలిపారు. బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్‌లా ఈ మూవీ ఉంటుందన్నారు. నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు సీజీ వర్క్ ఎక్కువగా అవసరం పడిందని అందుకే ఆలస్యమైందన్నారు. ఓ ఫిక్షనల్ హీరోను సృష్టించాలని అనుకున్నామని.. అలా పుట్టిందే త్రికాల సినిమా అని చెప్పారు.  ఈ సినిమాకు షాజిత్ హుమాయున్, హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా.. కెమెరామెన్‌గా పవన్ చెన్నా పనిచేస్తున్నారు. పీఆర్‌వోగా సాయి సతీష్ వ్యవహరిస్తున్నారు.

Also Read: Maha kumbh: మహా కుంభమేళ భక్తులు ఎగిరి గంతేసే వార్త.. మూడు రోజుల పాటు స్పెషల్ వందే భారత్ ట్రైన్‌లు.. డిటెయిల్స్..  

Also Read: Airtel: ఎయిర్‌టెల్ వినియోగదారులకు జాక్‌పాట్‌.. 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News