Akhanda Vs God Father Day 1 Collections: టాలీవుడ్ లో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ, మధ్య విపరీతమైన పోటీ ఉండేది. ఈ ఇద్దరూ పోటాపోటీగా సినిమాలు విడుదల చేసుకోవడమే కాక బాక్స్ ఆఫీస్ వద్ద కూడా గట్టిగానే పోటీ పడుతూ ఉండేవారు. వీరి అభిమానుల మధ్య కూడా పెద్ద ఎత్తున పోటీ వాతావరణం ఉండేది. అయితే అదంతా కూడా కాస్త మంచి వాతావరణంలో ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయా హీరోల అభిమానులు ఎప్పటికప్పుడు దారుణంగా ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్న పరిస్థితులు అందరికీ తెలిసిందే.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది. అయితే అనూహ్యంగా అఖండ సినిమాతో ఈ గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్స్ పోలుస్తూ ఇరు హీరోల అభిమానులు పెద్ద ఎత్తున ఒకరి మీద ఒకరు ట్రోల్స్ చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ సర్కారు అప్పట్లో సినీ టికెట్ల రేట్ల మీద ఆంక్షలు విధించి చాలా తక్కువ రేట్లకే సినిమాలు ప్రదర్శింపజేసేది.
ఆ సమయంలో విడుదలైన అఖండ సినిమా మొదటిరోజు దగ్గరగా 18 కోట్ల 74 లక్షల వసూళ్లు రాబట్టింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 16 కోట్ల దాకా షేర్ రాబట్టింది. దానికి తోడు ఇప్పుడు ఆచార్య సినిమా డిజాస్టర్ అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా పేరుతో ప్రేక్షకుల ముందుకు రావడం, అందులో సల్మాన్ ఖాన్ కూడా నటించడంతో ఈ సినిమా మీద భారీ హైప్ నెలకొంది. ఊహించిన విధంగా సినిమాకు మంచి టాక్ కూడా లభిస్తోంది. మొత్తం మీద ఈ ఆంధ్రప్రదేశ్ నైజాం కలిపి 715 స్క్రీన్ లలో మాత్రమే ఈ సినిమా రిలీజ్ చేశారు.
థియేటర్ కౌంట్ పరిమితంగా ఉన్నప్పటికీ ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 13 కోట్ల దాకా షేర్ రాబట్టింది. అయితే రెండు సినిమాలను గనక పోల్చి చూసినట్లయితే నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు అన్ని ప్రాంతాలలోనూ అఖండ -గాడ్ ఫాదర్ మీద హవా కనపరిచినట్లు అయింది. దీంతో ప్రాంతాల వారీగా పోలుస్తూ మెగాస్టార్ చిరంజీవి పని అయిపోయిందంటూ కొంతమంది కామెంట్ చేస్తుంటే కొంతమంది మాత్రం పరిమిత థియేటర్ కౌంట్ తో ఈ మాత్రం వసూళ్లు సాధించడం మామూలు విషయం కాదని కామెంట్ చేస్తున్నారు.
దానికి తోడు నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా ఫుల్ రన్ లో వచ్చిన వసూళ్లను మొదటి రోజు వసూళ్లతోనే క్రాస్ చేస్తామంటూ మెగా అభిమానులు కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ చేసినట్లు నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చూశారు కదా మా సత్తా ఏమిటో అంటూ నందమూరి అభిమానులు రివర్స్లో మెగా అభిమానులను, మెగాస్టార్ ను గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. మొత్తం మీద రెండు సినిమాలు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం
Also Read: RRR in Oscars: ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్.. అఫీషియల్ గా ప్రకటించిన సినిమా యూనిట్!
Also Read: Ram Charan Getting Trolled: మాట తప్పిన రామ్ చరణ్.. దారుణంగా ఆడుకుంటున్న నెటిజన్లు!
అఖండ | గాడ్ ఫాదర్ |
నైజాం : 4.39 కోట్లు | నైజాం: 3.29 కోట్లు |
సీడెడ్ : 4.02 కోట్లు | సీడెడ్: 3.18 కోట్లు |
ఉత్తరాంధ్ర : 1.36 కోట్లు | ఉత్తరాంధ్ర: 1.26 కోట్లు |
ఈస్ట్ గోదావరి: 1.05 కోట్లు | ఈస్ట్ గోదావరి: 1.60 కోట్లు |
వెస్ట్ గోదావరి: 96 లక్షలు | వెస్ట్ గోదావరి: 59 లక్షలు |
గుంటూరు : 1.87 కోట్లు | గుంటూరు: 1.75 కోట్లు |
కృష్ణ : 81 లక్షలు | కృష్ణా: 73 లక్షలు |
నెల్లూరు : 93 లక్షలు | నెల్లూరు: 57 లక్షలు |
ఆంధ్ర ప్రదేశ్ -తెలంగాణ : 15.39 కోట్లు షేర్ (23 కోట్లు గ్రాస్) | ఆంధ్ర ప్రదేశ్ -తెలంగాణ : 12.97 కోట్లు (21.40 కోట్ల గ్రాస్) |
కర్ణాటక +రెస్టాఫ్ ఇండియా : 1 కోటి | కర్ణాటక +రెస్టాఫ్ ఇండియా : 1.56 కోట్లు+ హిందీ; 45 లక్షలు |
ఓవర్సేస్ : 2.35 కోట్లు |
ఓవర్సేస్: 2.10 కోట్లు |
అఖండ ప్రపంచవ్యాప్తంగా: గాడ్ ఫాదర్ ప్రపంచ వ్యాప్తంగా :
18.74 కోట్లు ( 29.5 కోట్లు గ్రాస్) 17.08 కోట్లు (31.10 కోట్లు గ్రాస్)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook