ఇండియన్ సినిమాను ఓ ఊపు ఊపేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Alia Bhatt Childhood Photos: ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఓ ఊపు ఊపేస్తుంది. వరుస చిత్రాల్లో నటిస్తూ అటు హిందీతో పాటు తెలుగు సినిమాతోనూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అతి తక్కువ వయసులోనే స్టార్ డమ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా?

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 8, 2021, 11:56 AM IST
ఇండియన్ సినిమాను ఓ ఊపు ఊపేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Alia Bhatt Childhood Photos: కేవలం 28 ఏళ్ల వయసులోనే బ్యాక్-టు-బ్యాక్ హిట్స్ తో హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ నటి. 1999లో విడుదలైన హిందీ చిత్రం ‘సంఘర్ష్’ చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించిందీ చిన్నది. ఆ తర్వాత కరణ్ జోహార్ నిర్మాణంలో రూపొందిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో హీరోయిన్ వెండితెరకు పరిచయమై.. ఫ్యాన్స్ మనసు దోచేసింది. దీంతో పాటు ‘హైవే’, ‘ఉడ్తా పంజాబ్’, ‘డియర్ జిందగీ’, ‘రాజీ’, ‘గల్లీ బాయ్’ వంటి చిత్రాలతో నటనకు మంచి ప్రశంసలు పొందింది. ఆమె ఎవరో కాదు.. అలియా భట్. 

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ కుమార్తెగా చిత్రసీమకు పరిచయమైన ఈ భామ అతితక్కువ కాలంలోనే స్టార్ హోదాను దక్కించుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో ఈ భామ ప్రేమాయణం సాగిస్తున్న వార్తలు విపరీతంగా వచ్చాయి. అయితే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని తెలుస్తోంది. వీరిద్దరి గురించి నిత్యం ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. 

అలియా భట్.. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గంగూబాయి కతియావాడి’ సినిమాతో పాటు ‘బ్రహ్మాస్త్ర‘, ‘ఆర్ఆర్ఆర్‘ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

 

Also Read: ఈ ఫొటోలో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

Also Read: Vicky Katrina Wedding OTT Platform: విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ పెళ్లి ఫుటేజ్ కోసం రూ.100 కోట్ల ఆఫర్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News