Allu Aravind Clarity on Clashes with Chiranjeevi in Ali tho Saradaga Show: అల్లు రామలింగయ్య కుమారుడు అల్లు అరవింద్ అల్లు రామలింగయ్య బతికి ఉన్నప్పుడే గీత సంస్థ బాధ్యతలు చేపట్టారు. ఆ నిర్మాణ సంస్థ ద్వారా అనేక సినిమాలు చేసి తెలుగులో టాప్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు. ఆయన సినిమా అంటే మినిమం గ్యారంటీ అనిపించుకునే విధంగా తెలుగులో ఆయన మంచి క్రేజ్ అయితే సంపాదించారు. ప్రస్తుతానికి సినీ నిర్మాణానికి బ్రేక్ ఇచ్చిన ఆయన గీతా ఆర్ట్స్2 పేరుతో ఒక బ్యానర్ ఏర్పాటు చేసి బన్నీ వాసు అనే నిర్మాతతో సినిమాలు నిర్మింప చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద ప్రస్తుతానికి ఎలాంటి సినిమాలు చేయడం లేదు.
గీత ఆర్ట్స్ 2 పర్యవేక్ష బాధ్యతలు చేస్తూనే ఆహా వీడియో సంస్థను కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. అయితే తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న అల్లు అరవింద్ చిరంజీవితో ఉన్న విభేదాల గురించి మొట్టమొదటిసారిగా పెదవి విప్పారు. చాలా కాలం నుంచి మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ కుటుంబాల మధ్య దూరం పెరిగిందని చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ఏర్పాటు చేయడంతో గీతా ఆర్ట్స్ కు కొణిదెల ప్రొడక్షన్స్ కు మధ్య దూరం పెరిగి తద్వారా అల్లు ఫ్యామిలీ -మెగా ఫ్యామిలీ మధ్య కూడా దూరం పెరిగింది అనే ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి.
ఈ విషయం మీద పలు సందర్భాల్లో మెగా ఫ్యామిలీ నుంచి కానీ అల్లు ఫ్యామిలీ నుంచి గాని ఖండనలు వస్తూ ఉండేవి కానీ పూర్తిస్థాయిలో అసలు విషయం ఏమిటనే విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే తాజా షోలో మాత్రం అల్లు అరవింద్ ఈ విషయం గురించి కూలంకషంగా చర్చించారనే చెప్పాలి. తాను మెగాస్టార్ చిరంజీవిని మొట్టమొదటిసారిగా చలసాని గోపి అనే నిర్మాత ఆఫీసులో కలిశానని, ఆరోజు చిరంజీవి తనకు షేక్ హ్యాండ్ ఇచ్చారని అది ఇప్పటికీ అలాగే ఉందని చెప్పుకొచ్చారు. మేము బావా బామ్మర్దులమే అయితే అంతకు మించి మంచి స్నేహితులం అని, ఆ స్నేహ బంధాన్ని ఎవరు దూరం చేయలేరని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.
అలాగే రెండు కుటుంబాలు కలిసి ఎదిగాయని ఇది చాలా చిన్న సినీ పరిశ్రమ కాబట్టి కొంచెం పోటీ ఉండటం అయితే సాధారణమే కానీ తమ మధ్య విభేదాలు లాంటివి మాత్రం లేవని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. చిన్న సినీ పరిశ్రమ కావడంతో మా కుటుంబం నుంచి హీరోలు రావడం వారి కుటుంబం నుంచి హీరోలు రావడం, మా నిర్మాణ సంస్థ సినీ నిర్మాణంలో ఉండడం వారు కొత్తగా నిర్మాణ సంస్థ ఏర్పాటు చేయడం వంటివి జరిగి ఉండవచ్చు కానీ మేము ఏమీ విడిపోలేదని అన్నారు. ప్రతి సంక్రాంతి, ప్రతి దీపావళి పండుగకు కుటుంబాలన్నీ కలిసి పండుగ చేసుకుంటామని ఆయన అన్నారు. అయితే మేము కలుస్తామన్న విషయాన్ని అందరికీ అయితే చెప్పాల్సిన అవసరం లేదని తాను భావిస్తున్నానని అది తన పర్సనల్ స్పేస్ కాబట్టి తాము కలిసి ఉన్న సమయాన్ని ఎంజాయ్ చేయడానికే చూస్తామని అన్నారు. ఇక బహుశా ఇప్పటికైనా ఈ ప్రచారానికి బ్రేకులు పడతాయేమో వేచి చూడాలి మరి.
Also Read: RGV on Garikapati: గరికపాటికి పద్మ కూడా ఎక్కువే.. పద్మశ్రీని ఎందుకు ఇచ్చారు? వర్మ సంచలన ట్వీట్లు
Also Read: Allu Aravind Counter: టాలీవుడ్ హీరోలకు అల్లు అరవింద్ కౌంటర్.. ఇప్పుడు అంతా వాళ్లే చేస్తున్నారంటూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook