Balakrishna: తాజాగా కేంద్రం తనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంపై నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అవార్డు
రావడం తనలో ఇంకా కసిని పెంచిందన్నారు. తనకు పద్మభూషణ్ అవార్డు కాదు ఎన్టీఆర్‌కు భారతరత్న రావాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మొన్న తనకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడంకంటే... ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు ఇస్తే తనకు ఎంతో సంతోషకంగా ఉండేదన్నారు. ఇక కోట్లాది మంది తెలుగు ప్రజలు కూడా అన్నగారికి భారత రత్న అవార్డుతో రావాలని ఆకాంక్షిస్తున్నారని ఆయన తెలిపారు. కచ్చితంగా నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు వస్తుందని నందమూరి బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.
బాలకృష్ణ గత 50 యేళ్లుగా హీరోగా అలరిస్తున్నారు. ఓ నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికీ అగ్రహీరోగా కొనసాగడం అనేది మాములు విషయం కాదు. అంతేకాదు తండ్రి ఎన్టీఆర్ బాటలో పౌరాణిక, జానపద, సాంఘీకం, సైన్స్ ఫిక్షన్, హార్రర్, సోషియో ఫాంటసీ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.
అంతేకాదు దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఓ నట వారసుడిగా తండ్రి తర్వాత పద్మ అవార్డు అందుకున్న నట వారసుడిగా సంచలనం రేపారు. అన్నగారికి పద్మశ్రీ అవార్డు వస్తే.. ఆయన వారసుడైన బాలకృష్ణకు దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డు వరించడం విశేషం. త్వరలో రాష్ట్రపతి చేతులు మీదుగా బాలయ్య ఈ అవార్డు అందుకోనున్నారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
బాలయ్య సినిమాల విషయానికొస్తే.. అఖండ నుంచి వరుస సక్సెస్ లతో దుమ్ము దులుపుతున్నాడు. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలతో హాట్రిక్ హిట్స్ అందుకొని.. తాజాగా ‘డాకు మహారాజ్’సినిమాతో వరుసగా నాల్గో సక్సెస్ ను అందుకున్నారు. ఈ సినిమా రీసెంట్ గా మూడు వారాలు కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ. 91 కోట్ల షేర్ (రూ. 165 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా రూ. 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 82 కోట్ల టార్గెట్ తో బరిలో దిగింది. మొత్తంగా దాదాపు బాక్సాఫీస్ దగ్గర రూ.7 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. ఈ సినిమా త్వరలో నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కు రానున్నట్టు సమాచారం. మరోవైపు బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2 తాండవం’ సినిమా చేస్తున్నారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.