Bigg Boss Shivaji Shocking Comments on Mega Family: బిగ్ బాస్ షో తో చాణుక్యుడుగా గుర్తింపు తెచ్చుకున్న హీరో శివాజీ ల్యాంగ్ గ్యాప్ తర్వాత వెబ్ సిరీస్ తో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. సుమారు 12 ఏళ్ల తర్వాత శివాజీ నటించిన వెబ్ సిరీస్ #90s. ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది ఉపశీర్షిక. ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీలో జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. ఈ నేపథ్యంలో #90s వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శనివారం గ్రాండ్‌గా జరిగింది. ఇందులో ఏపీ పాలిటిక్స్ పై హీరో శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
''ఏపీ కోసం బీజేపీ ఇచ్చిన హామీలను విస్మరించడం వల్లే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశానని.. ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని.. అయితే ప్రజల గొంతుకగా ఉంటానని'' శివాజీ చెప్పుకొచ్చాడు. ''నాకు ఓ కుటంబం ఉంది.. అందుకే నాకు ఏం లేనప్పుడు అన్నీ ఇచ్చిన సినిమాల వైపు నా జర్నీని తిరిగి మొదలుపెట్టా.. ఆ సమయంలోనే బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్లాను'' అని శివాజీ అన్నాడు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Also Read: Pushpa Part 2: 'పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్' స్పూఫ్ షార్ట్ ఫిల్మ్.. నెట్టింట వైరల్.. మీరు చూశారా..?
"ఎన్నో ఏళ్లుగా పవన్ కల్యాణ్ రాజకీయాల్లో పోరాడుతున్నారు కదా. మరి ఆయనతో చేరొచ్చు కదా" అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. "ప్రజల్లో ప్రశ్నించే తత్వం పోయింది. పదేళ్ల పాటు నేను ఏపీ కోసం పోరాడాను. ఇక మెగాస్టార్ కుటుంబానికే ఏపీలో, తెలంగాణలోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సీఎం అవ్వాలంటే మెగా కుటుంబానికి పెద్ద కష్టమేమి కాదు. కానీ, ఎక్కడో లోపం ఉంది. దాన్ని సరిదిద్దుకుంటే ఆ ఫ్యామిలీలో ఒక్కరు ఖచ్చితంగా సీఎం అవుతారు'' అని శివాజీ జవాబు చెప్పాడు.
Also Read: Bigg Boss Amardeep: బిగ్ బాస్ అమర్ దీప్‌పై పుస్తకం.. నిజమైన విన్నింగ్ అంటే ఇదే కదా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook