Chikoti Praveen on Bollywood actress: బాలీవుడ్ హీరోయిన్లు వచ్చేది అందుకే.. అసలు విషయం బయటపెట్టేసిన చికోటి!

Chikoti Praveen Clarity on Bollywood actress in ED Case: ఈడీ కేసులో చికోటి ప్రవీణ్ ను అరెస్ట్ చేసిన సమయంలో పలువురు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు తెర మీదకు వచ్చాయి. తాజాగా ఈ వ్య్వవహారం మీద చికోటి ప్రవీణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 20, 2022, 07:36 PM IST
Chikoti Praveen on Bollywood actress: బాలీవుడ్ హీరోయిన్లు వచ్చేది అందుకే.. అసలు విషయం బయటపెట్టేసిన చికోటి!

Chikoti Praveen Clarity on Bollywood actress in ED Case: కొన్నాళ్ల క్రితం హైదరాబాదుకు చెందిన క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా ఒక క్యాసినో నిర్వాహకుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి అన్ని వివరాలు రాబడుతూ కొన్ని రోజుల పాటు విచారణ చేయడం చర్చనీయాంశమైంది.

ఈ సమయంలో క్యాసినో అకౌంట్స్ నుంచి మల్లికా శెరావత్ కి కోటి రూపాయలు, అమీషా పటేల్ కి 80 లక్షలు, తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బకు 40 లక్షలు, డింపుల్ హయాతికి 40 లక్షలు, ముమైత్ ఖాన్ కి 15 లక్షలు, బాలీవుడ్ హీరో గోవిందకి 50 లక్షలు ఇచ్చినట్లు కూడా రికార్డులు బయటపడ్డాయి. ఇక వీరు మాత్రమే కాకుండా బాలీవుడ్ వివాదాస్పద కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కూడా చికోటి ప్రవీణ్ దగ్గర నుంచి 20 లక్షల దాకా తీసుకున్నట్లు ఆధారాలు లభించాయి.

అయితే జీ తెలుగు న్యూస్ కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చికోటి ప్రవీణ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ అసలు ఆ ఆరోపణలు ఆరోపణలు గానే ఉన్నాయి కానీ ఎక్కడ రుజువు కాలేదని మరోసారి గుర్తు చేశారు.

ఇక గోవాలో జరిగే క్యాసినో ఈవెంట్ కి నేను ఎవరిని ప్రత్యేకంగా పిలిచి గ్యాంబ్లింగ్ ఆడమని చెప్పలేదని, ఎవరు ఇష్టంతోనే వారు ఎంజాయ్మెంట్ కోసం గోవా వస్తుంటారని చికోటి అన్నారు. ఇక ఈ సందర్భంగా బాలీవుడ్ సెలబ్రిటీలను నా ఈవెంట్ ప్రమోషన్ కోసమే వాడుకుంటానని ఇతర ఏ కార్యక్రమాలను వారితో నిర్వహించమని ప్రవీణ్ చెప్పుకొచ్చారు. ఇక తెలిసిన వ్యక్తుల ద్వారా తనకు బాలీవుడ్ లో అనేక మంది హీరో హీరోయిన్లు డైరెక్ట్ గా పరిచయం ఉన్నారని ఆయన ఈ సంధర్భంగా చెప్పుకొచ్చారు. 
Also Read: Allu Arjun beats Khan's : ఖాన్స్ ను వెనక్కు నెట్టిన అల్లు అర్జున్.. బాలీవుడ్లో పుష్ప కోసమే వెయిటింగ్!

Also Read: Priyamani Divorce: విడాకులకు సిద్దమైన ప్రియమణి.. అందుకే ఆరోజు నుంచే విడివిడిగా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News