Chiranjeevi Waltair Veerayya : వాల్తేరు వీరయ్య వీర విహారం.. ఫస్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్

Waltair Veerayya Overseas Collections మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ములేపేస్తోంది. మౌత్‌ టాక్‌తో సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఫస్ట్ వీకెండ్‌లోనే వాల్తేరు వీరయ్య అదిరిపోయే కలెక్షన్లను రాబట్టేస్తోన్నట్టు కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2023, 10:35 PM IST
  • థియేటర్లో వాల్తేరు వీరయ్య సందడి
  • ఓవర్సీస్‌లో ఫస్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్
  • విదేశాల్లో మెగాస్టార్ చిరంజీవి మేనియా
Chiranjeevi Waltair Veerayya : వాల్తేరు వీరయ్య వీర విహారం.. ఫస్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్

Waltair Veerayya Overseas Collections మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, మాస్ మహారాజా రవితేజలు తమ తమ అభిమానులు ఎలా చూడాలని అనుకుంటారో అలానే చూపించాడు దర్శకుడు బాబీ. వాల్తేరు వీరయ్య సినిమా నిజంగానే మెగా అభిమానులకు ఓ ఫీస్ట్‌లా ఉంటుంది. రవితేజ ఫ్యాన్స్‌కి సైతం వాల్తేరు వీరయ్య కన్నుల పండువగా అనిపిస్తుంది. చిరంజీవి, రవితేజలు స్క్రీన్ మీద అలా స్టెప్పులు వేసినా, డ్యాన్స్ వేసినా కూడా జనాలు ఊగిపోతోన్నారు.

వాల్తేరు వీరయ్య సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ములేపేస్తోంది. వీర సింహా రెడ్డి సినిమాకు మొదటి రోజు రికార్డ్ కలెక్షన్లు వచ్చాయి. కాన వాల్తేరు వీరయ్య సినిమా రంగంలోకి దిగడంతో పరిస్థితి మారిపోయింది. వీర సింహా రెడ్డి కంటే వాల్తేరు వీరయ్యకే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. లోకల్‌లో పరిస్థితి పోటాపోటీగా ఉంటే.. ఓవర్సీస్‌లో లెక్కలు వేరేలా ఉన్నాయి.

ఓవర్సీస్‌లో 1.6 మిలియన్ డాలర్ల బిజినెస్ చేసింది. అయితే మధ్యాహ్నం వరకే 1.5 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. ఈ లెక్కన ఆదివారం ముగిసే వరకు 1.6 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ అయ్యేట్టుగా కనిపిస్తోంది. అంటే మొదటి వీకెండ్‌లోనే వాల్తేరు వీరయ్య ఓవర్సీస్ ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయ్యేట్టు కనిపిస్తోంది.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పుడప్పుడు బ్రేక్ ఈవెన్ అయ్యేట్టు కనిపించడం లేదు. ఇప్పటి వరకు యాభై శాతం వరకు రికవరీ అయినట్టు తెలుస్తోంది. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య అసలు సిసలు విన్నర్‌గా నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ తరువాత లైన్‌లో వీర సింహా రెడ్డి ఉండబోతోంది. మూడో స్థానంలో వారసుడు నిలిచేట్టు అనిపిస్తోంది. అజిత్ తెగింపుకు అతి తక్కువ కలెక్షన్లు వస్తున్నాయని తెలుస్తోంది.

తమిళ నాట అజిత్ వర్సెస్ విజయ్ అని నడుస్తుంటే.. టాలీవుడ్‌లో మాత్రం చిరంజీవి వర్సెస్ బాలయ్య నడుస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్, అజిత్ తమ సత్తాను చాటుతున్నాడు. వారసుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వడంతో కాస్త కలెక్షన్లు వస్తున్నాయి.

Also Read:  Upasana Motherhood : ఈ సంక్రాంతికి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నా.. ఉపాసన పోస్ట్ వైరల్

Also Read: Nandamuri Balakrishna Controversy : ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే.. క్షమాపణలు కోరిన బాలయ్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News