Have You Observed these Common Points in virupaksha and Balagam Movies: ఈ మధ్యకాలంలో బలగం సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కమెడియన్ గా, కమెడియన్గా పలు సినిమాల్లో కూడా నటించిన వేణు డైరెక్టర్గా మారి ఈ సినిమా తెరకెక్కించాడు, దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి ఒక కొత్త నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి ఈ సినిమాను నిర్మించారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సుధాకర్ రెడ్డి, రూపా లక్ష్మి, మురళీధర్ గౌడ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.
తెలంగాణ పల్లెల్లో ఉండే పిట్ట ముట్టుడు సంప్రదాయం ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కించగా కేవలం తెలంగాణ ప్రాంత వాసులు మాత్రమే కాదు ఆంధ్ర ప్రాంత వాసులు కూడా సినిమాకి కనెక్ట్ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తున్నా ఇంకా థియేటర్లకు వెళ్లి మరీ చూస్తున్నవారు ఉన్నారంటే ఈ సినిమా ఎంతలా ప్రేక్షకులను కనెక్ట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్య వచ్చిన విరూపాక్ష సినిమాకి ఈ బలగం సినిమాకి ఒక కామన్ పాయింట్ ఉందని సినిమా చూసినవారు అంటున్నారు.
అదేమిటంటే బలగం సినిమా ఆద్యంతం పిట్ట ముట్టుడు అనే కాన్సెప్ట్ చుట్టూనే తిరుగుతుంది ఇక్కడ పిట్ట అంటే మరేమిటో కాదు కాకి. చనిపోయిన పితృదేవతలకు పిండాలుగా చేసి కొన్నిచోట్ల తరఫున వదులుతారు. అలాగే తెలంగాణ ప్రాంతంలో చనిపోయిన ఆయనకు ఇష్టమైన ఆహార పదార్థాలు సిద్ధం చేసి వారికి ఇష్టమైన ప్రదేశంలో విడిచిపెడతారు.
కాకి వచ్చి వాటిని తింటే చనిపోయిన వ్యక్తి ఆనందంగా ఉన్నాడని ఎలాంటి ఇబ్బందులు లేవని భావిస్తూ ఉంటారు అలా బలగం సినిమాకి కాకి కీలకమైన పాత్ర పోషించిందని చెప్పక తప్పదు. ఇప్పుడు విరూపాక్ష సినిమాలో కూడా కథ దాదాపుగా కాకుల చుట్టూనే తిరగడం ఆసక్తికరంగా మారుతుంది. విరూపాక్ష సినిమా కథ మొత్తం చేతబడుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చేతబడుల కథ కావడంతో కాకిని చాలా ఎక్కువగా యూజ్ చేసుకున్నారు. హీరో ఎంట్రీలోనే కాకి ఆయనకు షాకిస్తుంది.
ఆ తర్వాత స్టోరీలో కొందరు చనిపోవడానికి, ప్రేక్షకుల్ని భయపెట్టడానికి కారణమవుతూ ఉంటుంది కాకి. ఒక్క మాటలో చెప్పాలంటే హీరోహీరోయిన్ తర్వాత కాకి ఎక్కువగా కనిపించింది అనడంలో అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో విరూపాక్ష సినిమాకు బలగం సినిమాకి మధ్య కామన్ పాయింట్ కాకులు అని కొందరు కామెంట్ చేస్తున్నారు. అంతెందుకు విరూపాక్ష సినిమా పోస్టర్ల మీద కూడా కాకులను ప్రత్యేకంగా ముద్రించారు అంటే సినిమా కథకు కాకులకు ఎంత కనెక్షన్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అదండీ సంగతి
Also Read: Pooja Hegde's List: పూజా హెగ్డే లిస్టులో మరో డిజాస్టర్.. పాపం మరక మనేలా లేదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook