Vani jayaram Postmortem: వాణి జయరాం పోస్టుమార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు..

Singer Vani jayaram Postmortem: సింగర్ వాణీ జయరాం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నేపధ్యంలో ఆమె పోస్టుమార్టం ప్రిలిమినరీ రిపోర్టు బయటకు వచ్చింది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 5, 2023, 06:31 PM IST
Vani jayaram Postmortem: వాణి జయరాం పోస్టుమార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు..

Singer Vani jayaram Postmortem Report: తన కెరియర్లో సుమారు 20 వేల పాటలు పాడి శ్రోతలను అలరించిన ప్రముఖ గాయని వాణీ జయరాం అనుమానాస్పద పరిస్థితుల్లో చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలోని తన నివాసంలో మృతి చెందారు. అయితే ముందుగా ఆమె మరణించినట్లు వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఎలా మరణించారు అనే విషయం మీద క్లారిటీ లేదు, ఆమె వయసు కూడా ఎక్కువ కావడంతో వయోభారం రీత్యా చనిపోయి ఉండవచ్చు అని అందరూ భావించారు.

కానీ కొద్దిసేపటికే ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించారు అనే విషయం బయటకు వచ్చింది. ఆమె నుదుటి భాగంలో గాయాలయ్యాయని పనిమనిషి గుర్తించడంతో ఆ విషయాన్ని పోలీసులకు చేరవేయడం వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్లడంతో ఈ విషయం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎట్టకేలకు ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు చెన్నై బీసెంట్ నగర్ స్మశాన వాటికలో వాణి జయరాం అంత్యక్రియలు జరిగాయి.

ఇక ఆమె అంత్యక్రియలు కంటే ముందు ఆమె మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ పోస్టుమార్టం వాణీ జయరాం నుదుటి మధ్య భాగంలో ఒక ఇంచు లోతుగా తలకు గాయమైనట్లుగా గుర్తించారు. మంచం కింద ఉండే భార్యలకు తల గట్టిగా తగిలిన సమయంలో ఈ గాయం అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే ఇది ప్రిలిమినరీ రిపోర్టు అని పూర్తి రిపోర్టు వస్తే కానీ ఈ అంశం మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు. వాణి జయరాం తమిళనాడులో జన్మించి వివాహం తర్వాత ముంబై షిఫ్ట్ అయ్యారు, ఆ తర్వాత సింగింగ్ ప్రారంభించిన ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఒరియా, గుజరాతి, తుళు భాషలతో పాటు సుమారు 19 భాషల్లో 20,000వ పాటల వరకు పాడారు.
Also Read: Pooja Hegde Struggling: 'పూజా'కొక తెలుగు సినిమా కావలెను!

Also Read: Bigg Boss’s Telugu OTT: బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ విషయంలో షాక్.. అసలు సంగతి అదేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 
 

Trending News