Renu Desai: ఆ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న రేణూ దేశాయ్..

Renu Desai Viral Comments: రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బద్రి, జానీ సినిమాల్లో కనిపించి మెప్పించిన ఈ నటి.. కొద్దిరోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఈ మధ్యనే మళ్లీ.. రవితేజ టైగర్ నాగేశ్వరరావు కనిపించింది. ఈ క్రమంలో ఇప్పుడు రేణు దేశాయ్ 1000 వర్డ్స్ అనే సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరస్ అవుతున్నాయి.   

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jan 8, 2025, 01:11 PM IST
Renu Desai: ఆ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న రేణూ దేశాయ్..

1000 Words Movie: అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ దివి, మేఘన శ్రీనివాస్, వినయ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం  1000 వర్డ్స్. ఈ సినిమా విల్లర్ట్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌లో తెరకెక్కింది. రమణ విల్లర్ట్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కథ, స్క్రీన్ ప్లే డా. సంకల్ప్ అందించగా, శివ కృష్ణ సంగీతం సమకూర్చారు.  

ఈ చిత్ర ప్రత్యేక ప్రదర్శన సోమవారం నిర్వహించగా, రేణూ దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి, మధుర శ్రీధర్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. సినిమాని చూసిన అనంతరం వారు తమ భావాలను పంచుకున్నారు.  

Renu Desai Emotional Speech: రేణూ దేశాయ్ మాట్లాడుతూ, "రమణ గారు ఫోటోగ్రాఫర్‌గా నాకు తెలిసినా, ఆయన దర్శకత్వ ప్రతిభ నాకు ఆశ్చర్యం కలిగించింది. ఒక్క ఫోటో ఆధారంగా అద్భుతమైన కథను తీయగలిగారు. క్లైమాక్స్ చూస్తుంటే కన్నీళ్లు ఆగలేదు. రమణ గారికి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నాను," అని వ్యాఖ్యానించారు.  

ఈ ఈవెంట్ కి ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కూడా హాజరు కాగా.. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, "1000 వర్డ్స్ సినిమా హృదయాలను కదిలిస్తుంది. ఇది అవార్డులు గెలుచుకోవడమే కాకుండా ప్రతీ ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది," అన్నారు.  

బిగ్ బాస్ ద్వారా పేరు తెచ్చుకున్న దివి మాట్లాడుతూ, "సినిమా చివర్లో నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. ఈ సినిమాలో నా పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది," అని పేర్కొన్నారు.  హీరో అరవింద్ కృష్ణ, "ఈ సినిమాలో భాగమవడం నా అదృష్టం. కథ వినగానే గూస్‌బంప్స్ వచ్చాయి. రమణ గారి దర్శకత్వం అద్భుతంగా అనిపిస్తుంది," అని అన్నారు.  

ఇక డైరెక్టర్ రమణ విల్లర్ట్ మాట్లాడుతూ, "ఇది నా 20 ఏళ్ల కల. మాతృత్వం అనుభూతిని చూపించే కథను తీసి ప్రేక్షకులకు అందించగలిగాం," అని తెలిపారు.   సంగీత దర్శకుడు శివ కృష్ణ, సినిమాటోగ్రాఫర్ శివ రామ్ చరణ్, రచయిత సంకల్ప్ వంటి వారి కృషిని రమణ ప్రత్యేకంగా ప్రస్తావించారు.  

ఈ సినిమా క్లైమాక్స్ అందరినీ కంటతడి పెట్టిస్తుంది అని ప్రతి ఒక్కరూ చెప్పడం ఈ సినిమా పైన అందరికీ ఆసక్తి నెలకొల్పింది.. మాతృత్వం, కుటుంబ బంధాలను హృదయానికి హత్తుకునేలా చూపిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసును గెలుచుకుంటుందని సినిమా యూనిట్ తెలియజేశారు. మ్యూజిక్ డైరెక్టర్ పీవీఆర్ రాజా సంగీతం సినిమాకు మరింత ప్లస్ కానుందని చెబుతున్నారు. అద్భుతమై సాంగ్స్ ఇచ్చారని తెలిపారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్‌లో ఉంటుందన్నారు.

Also Read: KT Rama Rao: మోసాన్ని కప్పిపుచ్చడానికే ఏసీబీ విచారణ డ్రామా: కేటీఆర్

Also Read: Rajinikanth: కంట్రోల్‌ తప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్.. ఎయిర్‌పోర్టులో మీడియాపై చిందులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News