OG Update: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్, మరొకవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే అభిమానులకు వినోదాన్ని పంచడానికి తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మూడు సినిమాలను త్వరగా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు.
అందులో భాగంగానే హరిహర వీరమల్లు, ఓజీ సినిమా షూటింగ్లలో బిజీగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇక మరొకవైపు హరిహర వీరమల్లు సినిమా నుండి మాట వినాలి అంటూ ఒక పాట రిలీజ్ చేయగా.. ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి కొత్త చిక్కులు వచ్చినట్లు సమాచారం.
హరిహర వీరమల్లు సినిమా కొనుగోలు చేయడానికి బయ్యర్స్ ఎవరు ముందుకు రాకపోవడంతో అటు అభిమానులు కంగారుపడుతున్నారు. ఇటు నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు లేకపోవడం దీనికి ప్రధాన కారణం అని తెలుస్తోంది.
ఇకపోతే హరిహర వీరమల్లు సినిమాను కొనుగోలు చేయడానికి బయ్యర్లు ఎవరు ముందుకు రాకపోవడంతో ఈ సినిమా నిర్మాతలు సరికొత్త ప్లాన్ చేసినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ మరొకవైపు నటిస్తున్న చిత్రం ఓ జి. ఈ సినిమా మేకర్స్ తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం.
ముఖ్యంగా అమ్మకపు హక్కులను ఓ జి టీం తో అమ్ముకునేటట్టు ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ హరిహర వీరమల్లుకు మాత్రం బయ్యర్స్ కష్టాలు భారీగా వచ్చి పడ్డాయని చెప్పవచ్చు. ఈ చిత్రాలతో పాటు పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరొక సినిమా ఉస్తాద్ భగత్ సింగ్.ఈ సినిమాని కూడా త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు
Also Read: SVSN Varma: పవన్ కల్యాణ్ పోస్టుకు 'పిఠాపురం గండం'.. నారా లోకేశ్‌కు ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ జై!
Also Read: Amit Shah: అంబేడ్కర్ వ్యాఖ్యల చిచ్చు.. ఆంధ్రప్రదేశ్‌లో అమిత్ షాకు ఘోర పరాభవం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.