IND vs PAK: భారత్, పాకిస్తాన్ జట్లకు భారీ జరిమానా.. అసలు కారణం అదే!

India fined for slow-over rate vs Pakistan in Asia Cup Clash. స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసినందుకు భారత్, పాకిస్థాన్‌ జట్లకు 40 శాతం మ్యాచ్‌ ఫీజ్‌ను ఐసీసీ జరిమానాగా విధించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 31, 2022, 06:50 PM IST
  • భారత్, పాకిస్తాన్ జట్లకు భారీ జరిమానా
  • అసలు కారణం అదే
  • ఆర్టికల్ 2.22 ప్రకారం
IND vs PAK: భారత్, పాకిస్తాన్ జట్లకు భారీ జరిమానా.. అసలు కారణం అదే!

India, Pakistan teams fined 40 percent for slow-over rate: ఆసియా కప్‌ 2022లో భాగంగా గత ఆదివారం పాకిస్థాన్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హార్దిక్‌ పాండ్యా (3/25), భువనేశ్వర్‌ కుమార్ (4/26) చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. మొహ్మద్ రిజ్వాన్‌ (43; 42 బంతుల్లో 4×4, 1×6) టాప్ స్కోరర్. లక్ష్య ఛేదనలో భారత్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 రన్స్ చేసి విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (35; 34 బంతుల్లో 3×4, 1×6), రవీంద్ర జడేజా (35; 29 బంతుల్లో 2×4, 2×6), హార్దిక్‌ పాండ్యా (33 నాటౌట్‌; 17 బంతుల్లో 4×4, 1×6) టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. 

అయితే భారత్, పాకిస్థాన్‌ జట్లకు షాక్ తగిలింది. స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసినందుకు ఇరు జట్లకు 40 శాతం మ్యాచ్‌ ఫీజ్‌ను ఐసీసీ జరిమానాగా విధించింది. ఇండో-పాక్ జట్లు తమ ఓవర్ల కోటాను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయడంలో విఫలమైనట్లు మ్యాచ్ రిఫరీ నివేదించడంతో ఐసీసీ చర్యలు తీసుకుంది. ఇరు జట్లు నిర్ణీత సమయానికి రెండు ఓవర్లు తక్కువగా వేశాయి. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలో ఒక ఓవర్ తక్కువ వేస్తే 20 శాతం జరిమానా పడుతుంది. 

భారత్, పాకిస్తాన్ కెప్టెన్లు రోహిత్ శర్మ, బాబర్‌ అజామ్‌ తమ తప్పును ఒప్పుకొన్నారని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రతిపాదిత జరిమానాను రోహిత్-బాబర్ అంగీకరించారని, అధికారిక విచారణ అవసరం లేదని ఐసీసీ తెలిపింది. భారత్-పాక్ మ్యాచ్‌కు ఫీల్డ్‌ అంపైర్లుగా వ్యవహరించిన మసుదుర్ రహ్మాన్‌, రుచిర పిల్లియగురుగె.. థర్డ్ అంపైర్‌ రవీంద్ర విమలసిరి, ఫోర్త్ అంపైర్‌ గాజి సోహెల్‌ ఇరు జట్లపై అభియోగాలు మోపడంతో ఐసీసీ ప్యానెల్‌ జరిమానా విధించింది.

Also Read: Malaika Arora Crush: అర్జున్ కపూర్ కాకుండా.. మరో హీరోపై కన్నేసిన మలైకా అరోరా!

Also Read: Tarun on SSMB28: మహేష్ బాబు సినిమాలో తరుణ్.. అసలు విషయం చెప్పేశాడుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News