Jabardasth Anchor Sowmya : డ్యాన్స్, యాక్టింగ్, కామెడీ ఏం రాదు.. అది కూడా రాదా?.. ఆది పరువుతీసిన యాంకర్ సౌమ్య

Gunde Jaari Gallanthayyinde Promo హోలీ సందర్భంగా మల్లెమాల ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. గుండెజారి గల్లంతయ్యిందే అంటూ రాబోతోన్న ఈ ఈవెంట్లో రొమాంటిక్ పర్ఫామెన్స్‌లు, కామెడీ స్కిట్లు అదిరిపోయాయి. అన్నింటి కంటే ఎక్కువగా ఆది సౌమ్య రైడింగ్ కామెడీని క్రియేట్ చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2023, 06:44 PM IST
  • హోలీ స్పెషల్ ఈవెంట్‌ ప్రోమో
  • గుండెజారి గల్లంతయ్యిందే అంటూ రచ్చ
  • ఆది పరువుతీసిన జబర్దస్త్ యాంకర్
Jabardasth Anchor Sowmya : డ్యాన్స్, యాక్టింగ్, కామెడీ ఏం రాదు.. అది కూడా రాదా?.. ఆది పరువుతీసిన యాంకర్ సౌమ్య

Jabardasth Anchor Sowmya Rao జబర్దస్త్ యాంకర్ సౌమ్య, హైపర్ ఆది ట్రాక్‌కు బుల్లితెరపై మంచి క్రేజ్ ఏర్పడింది. భలే మంచి రోజు అనే ఈవెంట్లో ఆది మీద సౌమ్య వేసిన సెటైర్లతోనే ఆమె వెలుగులోకి వచ్చింది. అంతకు ముందు కన్నడలో సీరియల్స్ చేసినా, తెలుగు ధారావాహికల్లో నటించినా రాని గుర్తింపు ఆ ఒక్క ఈవెంట్లో ఆమె వేసిన సెటైర్లతో వచ్చింది. ఆ తరువాత అనూహ్యంగా జబర్దస్త్ షో నుంచి అనసూయ తప్పుకోవడం, వేరే ఎవ్వరూ దొరక్కపోవడంతో సౌమ్యకు ఆ అవకాశం వచ్చింది.

అలా వచ్చిన అవకాశాన్ని సౌమ్య సైతం చక్కగా వినియోగించుకుంది. తెలుగు రాకపోయినా తన మాటలతో, లుక్స్‌తో, గ్లామర్‌తో ఆకట్టుకుంటూ వచ్చింది. ఆదితో సౌమ్య ట్రాక్ బాగానే క్లిక్ అయింది. అలా ఆదిని ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ అందరి దృష్టిలో పడింది. ఇక సౌమ్యను సైతం ఆది ఎలా అంటాడు.. ఎలాంటి కౌంటర్లు వేస్తాడో అందరికీ తెలిసిందే.

ఇక తాజాగా హోలీకి సంబంధించిన ఈవెంట్ ప్రోమోను రిలీజ్ చేశారు. గుండెజారి గల్లంతయ్యిందే అంటూ రాబోతోన్న ఈ ఈవెంట్‌లో ఒక్కొక్కరు రెచ్చిపోయారు. మానస్ రొమాంటిక్ పర్ఫామెన్స్‌తో చెమటలు పట్టిస్తే.. అర్జున్, నిరుపమ్ ఇద్దరూ కలిసి మాస్ డ్యాన్స్‌తో రచ్చ చేశారు. ఇదిలా ఉంటే.. ఆదిని సౌమ్య అన్న మాటలు ఇంకో ఎత్తు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News